Home » చాణక్య సూత్రాలు.. వీటిని పాటిస్తే, మిమ్మల్ని మోసం చేయడం అసాధ్యం

చాణక్య సూత్రాలు.. వీటిని పాటిస్తే, మిమ్మల్ని మోసం చేయడం అసాధ్యం

by Bunty
Ad

ప్రాచీన భారతదేశ చరిత్రలో ప్రముఖ స్థానం ఆక్రమించిన వారిలో చాణుక్యుడు కూడా ఒకరు. మౌర్య సామాజ్ర స్థాపకుడైన చంద్రగుప్త మౌర్యుడిగా గురువుగా ఆయనను అన్ని రకాలుగా తీర్చిదిద్దారు. అనంతరం రాజ్య స్థాపన, పరిపాలనలో మంత్రిగా తోడ్పాటును అందించారు. రాజనీతి, అర్ధ శాస్త్రంలో తనకున్న అపారమైన జ్ఞానాన్ని భావి తరాలకు అందించేందుకు గాను ఎన్నో రచనలు చేశారు. వాటిలో ‘‘చాణక్య నీతి’’ అన్న పుస్తకం ప్రముఖమైనది.

మనిషి ఎలా వుండాలి, ఎలా వుండకూడదు, నిత్య జీవితంలో పాటించాల్సిన నియమాలను అందులో పొందుపరిచారు. ఈ పుస్తకాన్ని ఎంతో ముందు చూపుతో చాణుక్యుడు రచించారు. నాటికి, నేటీకీ, ఏనాటికీ కూడా భారతీయులకు మార్గదర్శిగా నిలుస్తుందనడంలో అతిశయోక్తి లేదు.

ఈ పుస్తకంలో మనిషి మోసపోకుండా ఉంటాలంటే.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కొన్ని సూచనలు చేశాడు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

ఎవరైనా కాళ్లకు ముళ్ల గుచ్చుకోకుండా నడవాలనుకుంటే.. పాదాలకు చెప్పులు ధరించాలి. అలాగే ఎవరైనా దుర్మార్గులను నివారించాలనుకుంటే.. వారి లోపాలను ఎత్తిచూపుతూ.. పదిమందికి వారి గురించి తెలియజేయండి.. అప్పుడు వారు మీ ముందు తల ఎత్తడానికి కూడా సాహసించరు.

Advertisement

సిగ్గులేని వ్యక్తులకు ఎప్పుడూ దూరంగా ఉండాలి. తన గౌరవాన్ని పట్టించుకోని వ్యక్తి, అవతలి వారి గౌరవం, విలువను ఎప్పటికీ అర్థం చేసుకోలేడు. అలాంటి వ్యక్తితో స్నేహం చేస్తే… మీ గౌరవం తగ్గించుకున్నట్లే..

ఎవరికైనా నాలుగు వేదాలు , ధర్మశాస్త్రాల గురించి జ్ఞానం ఉండవచ్చు. అయితే మీ గురించి మీకు పరిపూర్ణంగా తెలియకపోతే అవన్నీ వ్యర్థం.. ఎలా అంటే.. జీవితం ఒక చెంచా లాంటిది. భోజనం చేసే సమయంలో అన్ని వంటకాలను తాకుతుంది. కానీ అది ఏ వంటనీ రుచి చూడలేదు.

ఏదైనా ముఖ్యమైన పనికి ప్రణాళిక రూపొందించేటప్పుడు ఎంతో అప్రమత్తంగా ఉండాలి. అంతేకాదు దానిని ఎవరితోనూ పంచుకోకూడదు. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా.. అప్పుడు శత్రువు ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. దీనితో పాటు ప్రణాళిక ఫలించి పని పూర్తయ్యే వరకు ఓపిక పట్టాల్సి ఉంటుంది.

తప్పుడు పనులు చేసే వారికి, ఇతరులను అవమానించే వ్యక్తులకు దూరంగా ఉండటం ఎప్పుడూ మంచిది. లేకుంటే మీరు వారికి ఎప్పుడు బలి అవుతారో మీకు కూడా తెలియదు. ఒక్కొక్కసారి మీ స్వంత ప్రతిష్టను కూడా అది దెబ్బతీస్తుంది.

మీరు ఎంత బలహీనులైనా, మీ లోపాలను ఎప్పుడూ అవతలివారికి తెలిసేలా ప్రవర్తించకూడదు. పాములాగా, అది విషపూరితం కానప్పటికీ.. బుసలు కొట్టడం ఆపదు.

Visitors Are Also Reading