చాలామంది షుగర్ వలన ఇబ్బంది పడుతూ ఉంటారు. షుగర్ ఉన్నట్లయితే కొన్ని విషయాలని పక్కా ఫాలో అవ్వాలి. షుగర్ ఉన్న వాళ్ళు వీటిని అలవాటు చేసుకుంటే హెల్త్ బావుంటుంది. ఈ అలవాట్లతో డయాబెటిస్ కి చెక్ పెట్టేయొచ్చు. రోజు రాత్రి ఒకే సమయానికి నిద్రపోవడం, ఒకే సమయానికి నిద్ర లేవడం చాలా మంచిది ఇలా చేయడం వలన షుగర్ అదుపులో ఉంటుంది. అలానే రాత్రి నిద్రపోయే ముందు ఎక్కువ ఆహారం తీసుకోవడం వలన షుగర్ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోతాయి. రాత్రి నిద్ర పోవడానికి రెండు గంటల ముందు ఆహారాన్ని తీసుకోండి. ఫిజికల్ యాక్టివిటీ పై దృష్టి పెట్టాలి.
Advertisement
రోజు వ్యాయామం చేస్తే షుగర్ కంట్రోల్ అవుతుంది. కనీసం అరగంట పాటు వ్యాయామం చేయడం మంచిది నిద్రపోవడానికి ముందు మీరు మీ షుగర్ లెవెల్స్ ని చెక్ చేసుకోండి. దానిని బట్టి మందులు తీసుకోవడం ఆహార పదార్థాలను తీసుకోవడం వంటివి ఫాలో అవ్వండి. ఒత్తిడి కారణంగా కూడా షుగర్ పెరిగిపోతుంది. ఒకవేళ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉండాలంటే ఒత్తిడిని తగ్గించుకోండి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి మ్యూజిక్ తో పాటుగా ధ్యానం, యోగా కూడా బాగా ఉపయోగపడతాయి.
Advertisement
Also read:
నిద్రలేమి సమస్యతో బాధపడే వాళ్ళల్లో కూడా షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. కనుక మంచి నిద్రని పొందడానికి మార్గం చూసుకోండి. మంచి నిద్ర ఉంటే షుగర్ కూడా పెరిగిపోకుండా ఉంటుంది. సరిపడా నీళ్లు తీసుకుంటే కూడా షుగర్ అదుపులో ఉంటుంది. నీళ్లు తాగకపోతే డీహైడ్రేషన్ వంటి ఇబ్బందులు కూడా వస్తాయి. షుగర్ ఉన్నట్లయితే ఎప్పటికప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయండి. అవసరమైతే టెస్ట్ చేయించుకోండి షుగర్ ని అదుపులో ఉంచుకోవడానికి చూసుకోండి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!