మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమా నుంచి తాజాగా అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో నటిస్తున్న హీరోయిన్ మీనాక్షి చౌదరి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది చిత్రం బృందం. ఈ సినిమాలో రాజి అనే పాత్రలో మీనాక్షి చౌదరి కనిపించనుంది. మరో ఎనిమిది రోజుల్లో థియేటర్లలో ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో మీనాక్షి చౌదరి పాత్రను చివరి క్షణంలో రివిల్ చేసింది చిత్ర బృందం.
అయితే ఈ సినిమాలో… హీరోయిన్ మీనాక్షి చౌదరి… మహేష్ బాబు మరదలు పాత్రలో కనిపించనుందట. ఆమె పాత్ర కేవలం సెకండ్ పార్ట్ లో మాత్రమే ఉందని తెలుస్తోంది. వాస్తవానికి మహేష్ బాబు మరదలుగా శ్రీ లీల చేయాల్సి ఉండేది. మెయిన్ హీరోయిన్ గా పూజా హెగ్డే ను అనుకుంది చిత్ర యూనిట్. కానీ చివరి క్షణంలో… గుంటూరు కారం ప్రాజెక్టు నుంచి… పూజా హెగ్డే తప్పుకున్న సంగతి తెలిసిందే. కొన్ని అనివార్య కారణాల వల్ల పూజా హెగ్డే ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది.
Advertisement
ఈ ప్రాజెక్టు నుంచి పూజా హెగ్డే తప్పకుండా తర్వాత పెద్ద రచ్చ జరిగిన సంగతి తెలిసిందే. పూజ హెగ్డే ఒకటే కాకుండా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా… మారిపోతున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. కానీ చివరికి పూజ హెగ్డే మాత్రం ఈ సినిమా నుంచి తప్పుకుంది. దీంతో మహేష్ బాబు సరసన మెయిన్ హీరోయిన్ గా శ్రీ లీల సెలెక్ట్ అయింది. అలాగే సెకండ్ హీరోయిన్ గా మీనాక్షి చౌదరి ఫైనల్ అయిపోయింది. కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్ మరియు టీజర్స్ సినిమాపై అంచనాలు భారీగా పెంచాయి. జనవరి ఆరవ తేదీన ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కానుండ గా జనవరి 12వ తేదీన అంటే సంక్రాంతి కానుకగా థియేటర్లలో ఈ మూవీ రిలీజ్ కానుంది.
Advertisement
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!