Home » ఫ్రిజ్‌లో ఉంచిన నీటిని అధికంగా తాగుతున్నారా..? అయితే ఈ విష‌యాలు త‌ప్పక తెలుసుకోండి..!

ఫ్రిజ్‌లో ఉంచిన నీటిని అధికంగా తాగుతున్నారా..? అయితే ఈ విష‌యాలు త‌ప్పక తెలుసుకోండి..!

by Anji
Ad

వేసవికాలంలో సహజంగానే చాలామంది చల్లని నీళ్లను తాగుతుంటారు. వేసవిలో సాధారణ నీరు వేడిగా ఉంటుంది కాబ‌ట్టి అలాంటి నీళ్లను తాగితే దాహం తీరదు. సహజంగానే ఎవరైనా సరే చల్లని నీళ్లు తాగేందుకు ఆసక్తిని చూపిస్తుంటారు. అయితే ప్రస్తుత తరుణంలో మట్టి కుండలో నీళ్లు తాగే వారు తక్కువ అయరు ఫ్రిజ్ లు దాదాపుగా ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఉంటున్నాయి కనుక ఫ్రిజ్ లలో నీళ్లను పెట్టుకుని అవి చల్లగా అయ్యాక తాగుతున్నారు అయితే వాస్తవానికి ఫ్రిజ్ లలో నీళ్లు మనకు హాని కలుగజేస్తాయి. దీనివల్ల మనకు అనేక దుష్ప్రభావాలు కలుగుతాయి అవేమిటంటే..?

Advertisement

ఫ్రిజ్ లలో ఉంచిన నీళ్లు మరి చల్లగా అవుతాయి అలాంటి నీళ్లను తాగడం అంత మంచిది కాదు అతి వేడిగా ఉండే నీళ్ళను మనం తాగలేము కదా అలాగే అతి చల్లగా ఉండే నీళ్ళను కూడా తాగరాదు తాగితే జీర్ణ వ్యవస్థ పై ప్రభావం పడుతుంది. కఫం బాగా తయారవుతుంది అది చిక్కబడి గట్టిగా అవుతుంది శరీరంలో నుంచి త్వరగా బయటకు రాదు దీంతో శాశ్వ కోశ సమస్యలు వస్తాయి కనుక ఫ్రిజ్ లలో ఉంచిన నీళ్లను నాగ రాదు మట్టికుండలో అయితే మరీ అతిగా చల్లగా నీళ్లు మారవు. మనం తాగే మోతాదులోనే నీళ్లు చల్లగా అవుతాయి అలాంటి నీళ్లను తాగిన మనకు ఏమీ కాదు కనుక మట్టి కుండలోని నీళ్లను తాగవచ్చు.

Advertisement


ఇలా చాలామంది మినరల్ వాటర్ ని నే తాగుతున్నారు కానీ అందులో సూక్ష్మక్రిములు ఉంటే ఒకవేళ ఆ నీటిని మరిగించిన కుండా అలాగే ఫ్రిజ్ లో పెడితే ఆ సూక్ష్మక్రిములు అలాగే ఉండే అవకాశాలు ఉంటాయి అలాంటి చల్లని నీళ్లను తాగడం ఇంకా హానికరం అదే మట్టి కుండలో నీళ్ళు పోస్తే మట్టిలో ఉండే మినరల్స్ కారణంగా ఆ నీటిలో ఉండే సూక్ష్మక్రిములు చనిపోతాయి అలాంటి నీటిని తాగిన మనకు ఎలాంటి హాని కలగదు కనుక మట్టికుండలో ఉంచిన నీళ్లను తాగడం మనకు మంచిది అని చెప్పవచ్చు.

 

ఇక మట్టి కుండలో నీళ్లు సహజసిద్ధంగా చల్లగా అవుతాయి దీనివల్ల పర్యావరణానికి కూడా ఎలాంటి హాని కలగదు కానీ ఫ్రిజ్ లో అయితే నీళ్లు కృత్రిమ పద్ధతిలో చల్ల గా మారుతాయి అలా అవి అవి చల్లగా అయ్యేటప్పుడు గాలిలోకి హానికర వాయువులు విడుదల అవుతాయి అవి పర్యావరణానికి హాని చేస్తాయి కనుక మట్టికుండలో అయితే సహజసిద్ధంగా చల్లగా అయ్యే నీళ్లు మనకు లభిస్తాయి కాబట్టి అన్ని విధాలుగా ఎటు చూసినా కూడా మట్టి కుండలోని నీళ్లను తాగడమే మనకు శ్రేయస్కరం అని చెప్పవచ్చు తాగితే మన శరీర రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది కనుక వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి :

  1. ది వారియ‌ర్ : బుల్లెట్ సాంగ్ పై రాక్‌స్టార్ ఏమ‌న్నారో తెలుసా..?
  2. యూరిక్ యాసిడ్ అంటే ఏమిటి..? దాని వ‌ల్ల ఎలాంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి..?
  3. బాహుబ‌లి సినిమాలో త‌మ‌న్నా రోల్‌ను మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవ‌రో తెలుసా..?
Visitors Are Also Reading