అతని పేరు శరణ్ హెగ్డే ముంబాయ్ లో నివాసం ఉంటాడు. ఫైనాన్స్ అడ్వైజర్ గా పనిచేస్తుంటాడు. సొంతింటి గురించి ట్విట్టర్ వేదికగా ఇతను వ్యక్తం చేసిన అభిప్రాయంపై సర్వత్రా చర్చ కొనసాగుతుంది. నేను కలల నగరమైన ముంబాయ్ లో నివసిస్తున్నాను, నా ఫ్లాట్ ఖరీదు 7 కోట్లు, కానీ నేను 1.5 లక్షల రూపాయలు రెంట్ కట్టి ఈ ఫ్లాట్ లో ఉంటున్నాను. నెలకు 5 లక్షలు EMI చెల్లించి, 1.4 కోట్ల డౌన్ పేమెంట్ చేసి ఫ్లాట్ ను కొనుక్కోవడం కంటే ఇదే ఉత్తమం! అందుకే నేను ఫ్లాట్ కొనలేదని చెప్పుకొచ్చాడు.
Advertisement
మరో ట్వీట్ లో…. సొంతింళ్లు కొనుక్కోవడం కంటే రెంటెడ్ ఇంట్లో ఉండడమే ఉత్తమం. 1.4 కోట్లు డౌన్ పేమెంట్, 5 లక్షల నెల EMI ప్లేస్ లో 1.5 లక్షల రెంట్ కట్టడం వల్ల నెలకు 3.5 లక్షలు మిగులుతున్నాయి. ఈ మొత్తాన్ని ఏదైనా షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తే దానిపై కనీసం 12 శాతం ( 1 రూపాయి) వడ్డీ వస్తుందనుకుంటే 20 సంవత్సరాల తర్వాత అయ్యే మొత్తం – 48.13 కోట్లు. అదే ఇళ్లు కొంటే ఆ ఇళ్లు 7 శాతం పెరిగితే …. 20 ఏళ్ళ తర్వాత ఆ ఇంటి కాస్ట్ -27 కోట్లు…. అంటే సొంతింటికంటే ఇన్వెస్ట్ మెంట్ చేస్తేనే డబ్బు రెండు రెట్లు పెరుగుతుంది. అని నీట్ గా లెక్కలతో సహా వివరించాడు.
Advertisement
వాస్తవానికి ఈ స్ట్రాటజీని మర్వాడీలు ఎక్కువగా ఫాలో అవుతారు. బిజినెస్ ను నిర్మించే క్రమంలో వారు వచ్చిన డబ్బును రొటేషన్ లోనే ఉంచుతారు. డబ్బు మరీ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే సొంతింటి వైపు ఆలోచిస్తారు. అప్పటి వరకు రెంట్ గానే ఉంటారు.