టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును టాలీవుడ్ సీనియర్ హీరో మోహన్ బాబు తన కూతురు మంచు లక్ష్మితో కలిసి చంద్రబాబు నివాసానికి వెళ్లారు. దాదాపు మోహన్‌బాబు గంటన్నరకు పైగా సమావేశం అయ్యారు. ఇదివరకు టీడీపీపై తీవ్ర విమర్శలు గుప్పించిన మోహన్‌బాబు ఉన్నట్టుండి చంద్రబాబుతో సమావేశమవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక చంద్రబాబు హయాంలోనే తన విద్యాసంస్థ శ్రీవిద్యానికేతన్ ఫీజు రీయంబర్స్‌మెంట్ విషయంపై టీడీపీ ప్రభుత్వం పై విరుచుకుపడ్డ మోహన్‌బాబు ఇప్పుడు చంద్రబాబుతో భేటీ కావడం పలు చర్చలకు తెరలేపింది.
Advertisement
చంద్రబాబును విమర్శించిన తరువాత వైసీపీలో చేరిన మోహన్‌బాబు ఆ పార్టీ తరుపునే ప్రచారం చేశారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మాత్రం మళ్లీ సైలెంట్ అయ్యారు. ఇక చంద్రబాబు-మోహన్ బాబు మధ్య గ్యాప్ చాలానే పెరిగింది. సన్ ఆఫ్ ఇండియా సమయంలో తనకు ప్రత్యక్ష రాజకీయాలపై ఆసక్తి లేదని.. ఈ జన్మకు రాజకీయాలు వద్దని మోహన్ చెప్పడం విశేషం. అదేవిధంగా చంద్రబాబు, జగన్ ఇద్దరూ తనకు బంధువులే అని చెప్పిన మోహన్‌బాబు తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్టు ప్రకటించారు.
Advertisement
ఇటీవలే మోహన్ బాబు తాను బీజేపీ మనిషిని అంటూ ఓపెన్ గా మాట్లాడారు. ఈ పరిస్థితుల మధ్య ప్రస్తుతం చంద్రబాబు-మోహన్ బాబు భేటీ అనేది హాట్ టాపిక్ గా మారింది. ఈ భేటీ పై సినీ రాజకీయం వర్షాల్లో కొత్త రకం చర్చలు ప్రారంభమయ్యాయి. జులై 26న మధ్యాహ్నం చంద్రబాబు నాయుడు నివాసానికి మోహన్ బాబు, మంచు లక్ష్మీ వెళ్లారు. ఈ భేటీ వెనుక రాజకీయ కోణం లేదని తెలుస్తోంది. తిరుపతి సమీపంలోని చంద్రగిరి పరిసరాల్లో తన విద్యాసంస్థ శ్రీవిద్యానికేతన్ ఆవరణలో సాయిబాబా ఆలయం నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణం పూర్తవ్వడంతో చంద్రబాబును ప్రత్యేకంగా ఆహ్వానించడానికి ఆయన నివాసానికి వెళ్లారట మోహన్‌బాబు. ఇందులో ఎలాంటి రాజకీయ ప్రాముఖ్యత లేదని టీడీపీ వర్గాలు వెల్లడించాయి.
Also Read :
“మళ్లీశ్వరి” చిత్ర యూనిట్ కు చుక్కలు చూపించిన కత్రీనా కైఫ్..! కోపంతో వెంకటేష్ ఏం చేశాడంటే..?
నాగార్జునకి జాతీయ అవార్డు మిస్ కావడానికి ఆ స్టార్ హీరోనే కారణమా..?