Home » ఏపీ నిరుద్యోగులకు అలర్ట్‌.. 5వ, పదో తరగతి అర్హతతో రాత పరీక్ష ఉద్యోగాలు.. నెలకు రూ.1,10,000ల జీతం..!

ఏపీ నిరుద్యోగులకు అలర్ట్‌.. 5వ, పదో తరగతి అర్హతతో రాత పరీక్ష ఉద్యోగాలు.. నెలకు రూ.1,10,000ల జీతం..!

by Bunty
Ad

ప్రభుత్వం చేయాలని ఎవరికైనా ఉంటుంది. ఉద్యోగం చేసి, బాగా సంపాదించాలని చాలా మంది అనుకుంటారు. కానీ ఉద్యోగ నోటీఫికేషన్లను ప్రభుత్వం రిలీజ్‌ చేయదు. అయితే, ఇలా బాధపడుతున్న వారికి అలర్ట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు తాజాగా అదిరిపోయే శుభవార్త చెప్పింది అక్కడి సర్కార్‌.  ఆ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన చిత్తూరు జిల్లా వైద్యారోగ్య కార్యాలయం, 53 స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, పెడియట్రీషియన్, సెక్యూరిటీ గార్డ్స్, మెడికల్ ఆఫీసర్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.

Advertisement

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టును బట్టి ఐదో తరగతి, పదవ తరగతి, ఇంటర్మీడియట్/ జిఎన్ఎం/ బ్యాచిలర్స్ డిగ్రీ/ బిఎస్సి /ఎంబీబీఎస్/ డిప్లొమా/ పీజీ డిప్లమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయస్సు 42 ఏళ్లకు మించకుండా ఉండాలి.

Advertisement

ఆసక్తి కలిగిన వారు డిసెంబర్ 31, 2022 వ తేదీ లోపు ఆఫ్లైన్ విధానంలో కింది అడ్రస్ కు పోస్ట్ ద్వారా అప్లికేషన్లను పంపించవలసి ఉంటుంది. జనరల్ అభ్యర్థులు రూ.300 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించవలసి ఉంటుంది. ఎస్సీ/ ఎస్టీ/ బీసీ వికలాంగ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. విద్యార్హతలు, అనుభవం ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఎంపికైన వారికి ఈ నెలకు రూ. 12,000 నుంచి రూ.1,10,000 వరకు జీతం గా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్ లో చెక్ చేసుకోవచ్చు.

READ ALSO :  తెలంగాణ పోలీస్ ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్.. వాళ్లకు ఈవెంట్స్‌ లేవు.. డైరెక్ట్‌గా మెయిన్సే

Visitors Are Also Reading