విక్టరీ వెంకటేష్ ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. ఏ హీరో ఫ్యాన్ అయినా సరే వెంకటేష్ ను కూడా ఇష్టపడతారు. దానికి కారణం వెంకటేష్ తక్కువగా మాట్లాడుతూ ఎలాంటి వివాదాల్లోనూ తల దూర్చడు. అంతే కాకుండా ఎప్పుడు చూసినా చాలా కూల్ గా జాలీగా కనిపిస్తూ ఉంటాడు. అయితే అలాంటి వెంకటేష్ కు నటుడు రాజేంద్రప్రసాద్ తో గొడవలు జరిగాయని అప్పట్లో వార్తలు వినిపించాయి. అంతే కాకుండా ఇద్దరి మధ్య చాలా కాలం గ్యాప్ వచ్చినట్టు కూడా వార్తలు వినిపించాయి.
Advertisement
అసలు ఆ వార్తలు ఎందుకు వచ్చాయి..ఇద్దరి మధ్య ఏం జరిగింది అన్నది ఇప్పుడు చూద్దాం….విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన చంటి సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ సినిమా ప్రేక్షకులకు ఎంతగానో కనెక్ట్ అవ్వడంతో పాటూ నటుడుగా కూడా వెంకీకి గుర్తింపు వచ్చింది. అయితే ఈ సినిమాను తంబి అనే తమిళ సినిమాకు రీమేక్ గా తెరకెక్కించారు. కే ఎస్ రామారావు మొదట తంబి తెలుగు రీమేక్ రైట్స్ ను దక్కించుకున్నారు.
Advertisement
కానీ మొదట హీరోగా వెంకటేష్ ను అనుకోలేదు. రాజేంద్రప్రసాద్ తో ఈ సినిమాను తెరకెక్కించాలని అనుకున్నారు. అంతే కాకుండా రాజేంద్రప్రసాద్ కు కథను కూడా వినిపించారు. ఆయన కూడా సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ తంబి సినిమా చూసిన నిర్మాత డి రామానాయుడు కేఎస్ రామారావును పిలిపించి చంటి సినిమాను వెంకటేష్ తో తీయాలని కోరారట.
దాంతో ఏం చేయాలో తోచక రామారావు కూడా ఒకే అనేశారు. రాజేంద్రప్రసాద్ ను పక్కన పెట్టి చంటి సినిమాను వెంకటేష్ హీరోగా తెరకెక్కించారు. ఈ నేపథ్యంలోనే వెంకటేష్ రాజేంద్రప్రసాద్ ల మధ్య గ్యాప్ వచ్చింది. ఈ విషయాన్ని డి రామారావు స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
ALSO READ: హీరో సుమంత్ తో మంచు లక్ష్మి… డార్లింగ్ అంటూ పోస్ట్!