మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ చిరుత సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. క్రియేటివ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ రామ్ చరణ్ ను టాలీవుడ్ కు పరిచయం చేశాడు. ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. కానీ రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ కు మంచి మార్కులు పడ్డాయి. ఇక ఈ సినిమా తర్వాత చరణ్ రాజమౌళి దర్శకత్వంలో మగధీర సినిమాలో నటించాడు. అప్పటికే రాజమౌళి పలు సూపర్ హిట్స్ ను అందుకున్న సంగతి తెలిసిందే.
Advertisement
కానీ మగధీర సినిమా లో ఉండే యుద్ధ సన్నివేశాలు…యాక్షన్ సీన్లు అదేవిధంగా లవ్ ఎమోషనల్ సీన్లు ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఈ సినిమాతోనే రాజమౌళి దర్శకుడిగా ఓ రేంజ్ కు ఎదిగిపోయాడు. ఈ సినిమా గురించి బాలీవుడ్ లో చర్చలు జరిగాయి. చాలా థియేటర్లలో ఈ సినిమా వంద రోజులకు పైగా ఆడి రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడిగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే.
Advertisement
అంతేకాకుండా ఈ సినిమాలో శ్రీహరి, రావు రమేష్ ముఖ్యమైన పాత్రల్లో నటించారు. పూర్వజన్మల కాన్సెప్ట్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా విషయంలో దర్శకుడు రాజమౌళి, నిర్మాత అల్లు అరవింద్ మధ్య గ్యాప్ వచ్చింది అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయిన తర్వాత అల్లు అరవింద్ రాజమౌళి ని సైడ్ చేశారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
అంతేకాకుండా సినిమా విడుదలకు ముందే రాజమౌళి సినిమా 100 రోజులు ఆడింది…. 75 రోజులు ఆడింది… ఇన్ని సెంటర్లలో ఆడింది అంటూ తప్పుడు ప్రచారాలు చేయవద్దని అల్లు అరవింద్ కు చెప్పారట. కానీ సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ అయిన తర్వాత అల్లు అరవింద్ ప్రేక్షకులను సంతృప్తి పరిచేందుకు రికార్డులను ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది అనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా తెలుగు లో విడుదలైన ఈ సినిమాను రెండు రెండు నెలల్లో తమిళంలో విడుదల చేయాలని రాజమౌళి అనుకున్నారు. కానీ బిజీగా ఉండటం తో అల్లు అరవింద్ దాన్ని పట్టించుకోలేదు. అందువల్లే మరోసారి ఇద్దరి మధ్య గ్యాప్ ఏర్పడిందని అప్పట్లో టాక్.