ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ లుగా రాణించిన వారిలో రాధ, విజయశాంతి ఇద్దరూ కూడా ఉంటారు. వీరిద్దరూ పోటీపడి సినిమాలు చేసేవారు. ఇద్దరు ఏక కాలంలో స్టార్ హీరోయిన్స్ గా రాణించడంతో పాటూ సినిమాల విషయంలో పోటీ పడేవారు. ఇద్దరూ కూడా టాలీవుడ్ లోని స్టార్ హీరోలకు జోడిగా నటించేవారు. అయితే రాధ విజయశాంతి ఫామ్ లో ఉన్న సమయంలో చిరంజీవి స్టార్ హీరోగా రాణించారు.
Advertisement
ఆ సమయంలో చిరంజీవితో సినిమాలు చేసేందుకు ఈ ఇద్దరు హీరోయిన్లు పోటీపడేవారట. చిరంజీవి విజయశాంతి కాంబినేషన్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. వీరిద్దరి కాంబినేషన్ కు అప్పట్లో ఎంతో క్రేజ్ ఉండేది. అదేవిధంగా రాధ చిరంజీవి సినిమాలకు సైతం అదే రేంజ్ లో క్రేజ్ ఉండేది. దాంతో దర్శకనిర్మాతలు ఇద్దరిలో ఎవరో ఒకరిని హీరోయిన్ గా పెట్టి సినిమాలు చేసేవారు.
Advertisement
అంతేకాకుండా విజయశాంతితో చిరంజీవి సినిమా ఒకటి వచ్చింది అంటే ఆ వెంటనే రాధ చిరంజీవి కాంబినేషన్ లో సినిమా వచ్చేది. అయితే ఒకానొక సమయంలో చిరంజీవితో సినిమాల విషయంలో రాధ, విజయశాంతి మధ్య కోల్డ్ వార్ జరిగేదని సీనియర్ పాత్రికేయులు చెబుతుంటారు. చిరంజీవితో సినిమాల విషయంలో రాధ విజయశాంతి మధ్య మాటలు కూడా సరిగా ఉండేవి కాదని సమాచారం.
ఇది ఇలా ఉంటే విజయశాంతి కొంతకాలం తరవాత లేడీ ఓరియంటెడ్ సినిమాల వైపు వెళ్లారు. ఆ తర్వాత ఎక్కువగా ఆమెకు లేడీ ఓరియంటెడ్ సినిమాల్లోనే ఆఫర్లు వచ్చేవి. ఇక రాధ విషయానికి వస్తే కేరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యారు. అయితే ఇద్దరి మధ్య కోల్డ్ వార్ జరిగింది కేవలం చిరంజీవితో సినిమాలు చేసేందుకే..ఆ తరవాత ఇద్దరూ కలిసి మాట్లాడుకునేవాళ్లు అంతే కాకుండా ఇండస్ట్రీలో ఇలాంటి పోటీ కామన్ అన్న సంగతి కూడా తెలిసిందే.