Home » గజ్వెల్ లో కెసిఆర్ ఓడిపోతున్నారా ? ఈ అయిదు కారణాల వలెనే ఓటమి భయమా ?

గజ్వెల్ లో కెసిఆర్ ఓడిపోతున్నారా ? ఈ అయిదు కారణాల వలెనే ఓటమి భయమా ?

by Sravya
Ad

తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైంది. పార్టీల ప్రచారం కూడా జోరుగా సాగుతోంది కెసిఆర్ రెండు చోట్ల నుండి పోటీ చేస్తున్నారు. అయితే ఈటల రాజేంద్ర కెసిఆర్ మధ్య పోటీ ఎలా ఉండబోతోంది, ఎవరు గెలుస్తారు అనేవి ప్రశ్నార్థకంగా మారాయి. కెసిఆర్ పై ఈటల రాజేందర్ పగ తీర్చుకుంటున్నారా అనేది కూడా చాలా మందిలో ఉంది.

Advertisement

గజ్వేల్ నుండి కేసీఆర్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే అలానే ఈటెల రాజేంద్ర కూడా ఆయనకి పోటీగా బరిలో నిలబడ్డారు. గజ్వేల్ లో కేసీఆర్ ఈసారి ఓడిపోతారా, ఎవరు గెలుస్తారు అనే దాని గురించి అంతా చర్చించుకోవడం మొదలుపెట్టారు.

వరుసగా రెండుసార్లు గెలిచిన కెసిఆర్ కి ఈసారి ఎదురవుతున్న బాధలేంటి..? గజ్వేల్ లో పోటీచేసిన కేసిఆర్ కి ఇదివరకు తిరుగులేదు బాగానే ఓట్లు పడ్డాయి. ఓట్లు ఎక్కువ రావడంతో రెండు సార్లు కూడా కేసీఆర్ గెలిచారు. గజ్వేల్ కి సంబంధించి యువతకి ఉద్యోగాలు లేకుండా పోయాయి అలానే ప్రజలకు కొన్ని ఇబ్బందులు వున్నాయి. కెసిఆర్ కి ఇవి పెద్ద ఇబ్బంది అయ్యేట్టు కనపడుతుంది పునరావసం విషయంలో కెసిఆర్ కి ఇబ్బందులు ఎదురు కానున్నాయి. జనాలు ఈ విషయంలో నష్టపోతున్నారని ఇది కేసీఆర్ పై పెద్ద ప్రభావం చూపబోతోందని అర్థమవుతుంది.

Advertisement

కెసిఆర్ పార్టీ పై నెగిటివ్ గా ఉన్నారు ఇక్కడ ప్రజలంతా కెసిఆర్ ఇచ్చిన హామీలు కూడా కొన్ని పూర్తి అవ్వకపోవడంతో ఆయనకి ఓట్లు తక్కువ పడతాయని తెలుస్తోంది. గజ్వేల్ లో డబల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా కట్టించారు కానీ లబ్ధిదారులకు వాటిని పొందలేకపోయారు తాత్కాలికంగా వీటిని ఇస్తామని చెప్పారు. అయితే ఎవరైతే ఈ ఇళ్లమీద ఆశలు పెట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా నష్టం జరిగింది అని వ్యతిరేకత మొదలైంది. అలానే వ్యాపారులు కూడా ఇబ్బంది పడుతున్నారు మరోపక్క ఛాన్స్ ని వదులుకోకుండా ఈటల రాజేందర్ ప్రతి పాయింట్ ని వాడుకుంటున్నారు మరి ఈసారి వీళ్ళ మధ్య గట్టి పోటీనే ఉంది ఏమవుతుందో చూడాలి.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading