ఒకప్పుడు మనదేశం లో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. కానీ ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఊరికి ఒకటి కూడా కనిపించడం లేదు. కానీ అప్పట్లో మాత్రం తాత నుండి మనవడి తరం వరకూ ఓకే ఇంట్లో ఉండేవాళ్ళు. ఉమ్మడి కుటుంబం వల్ల కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఉమ్మడి కుటుంబం లో పెద్దవాళ్ళు తమ పిల్లలకు మంచి చెడులను నేర్పిస్తారు.
Advertisement
కొత్తగా పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన జంటకు ఎలాంటి గొడవలు వచ్చినా పెద్దవాళ్ళు పంచాయితీ చెబుతారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు కాబట్టే లాయర్స్ కు, సైకాలజిస్ట్ లకు గిరాకీ పెరిగింది. అయితే తల్లి తండ్రులు తమ పిల్లలతో ఉండలేరు కాబట్టి పెళ్ళైన తరవాత తండ్రులు తమ కొడుకులకు ముందే కొన్ని సూచనలు చేయాలని మానసిక నిపుణులు చెపుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
పెళ్లికి ముందు తండ్రులు తమ కొడుకులకు డబ్బులను ఎలా ఖర్చు పెట్టాలి అనే విషాయన్ని చెప్పాలి. కొంతమంది కొత్తగా పెళ్ళైన మోజులో డబ్బులను ఎక్కువగా ఖర్చు చేసి అప్పుల పాలు అయ్యే అవకాశం ఉంది.
భార్యలతో ఎలా నడుచుకోవాలో చెప్పాలి. గొడవలు జరిగితే ఎలా సర్దుకుపోవాలి….గొడవలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే విషయాన్ని చెప్పాలి.
ఎలాంటి సమస్య వచ్చినా పెళ్లి తరవాత కూడా తాను అండగా ఉంటానని తండ్రి కొడుక్కు బరోసా ఇవ్వాలి. అలా చేయడం వల్ల కొడుకులకు ఎలాంటి సమస్య వచ్చినా కృంగి పోకుండా నికబడగలుగుతారు.
తాను జీవితాన్ని ఎలా లీడ్ చేశారో కొడుక్కి పూర్తిగా వివరించాలి. కొడుక్కి తండ్రి రోల్ మోడల్ కాబట్టి తండ్రి చెబితే ఖచ్చితంగా వింటారు.
కోపంతో కాకుండా ప్రేమతో చెబితే ఎవరైనా ఉంటారు. తండ్రి కొకుక్కి ఒక ఫ్రెండ్ లా ఉంటూ ఏ విషయాన్ని అయినా ప్రేమతో ఒక ఫ్రెండ్ లా చెప్పాలి.