క్రికెట్ చరిత్రలో కొంతమంది ఆటగాళ్లు ఫాస్టెస్ట్ గా అర్థసెంచరీ చేసి చేసి రికార్డు సృష్టించారు. అలా రికార్డు క్రియేట్ చేసిన ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు చూద్దాం….
సనత్ జయసూర్య
శ్రీలంకకు చెందిన లెజండరీ ఆల్ రౌండర్ కేవలం 17బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేశాడు. 1996వ సంవత్సరంలో ఎప్రిల్ 7వ తేదీన పాక్ తో జరిగిన మ్యాచ్ లో ఈ స్కోర్ సాధించాడు. బలమైన పాక్ బౌలింగ్ ఎదురుకుని మరీ జయసూర్య ఈ రికార్డు క్రియేట్ చేశాడు.
Advertisement
షే హోప్
షేప్ కేవలం 16 బంతుల్లోనే అర్థ సెంచరీ చేశాడు. వెస్టిండిస్ కు చెందిన ఈ ఆటగాడు 2018వ సంవత్సరం డిసెంబర్ 18న బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో ఈ రికార్డు క్రియేట్ చేశాడు.
ఏబీ డెవిలియర్స్
ఎవరూ ఊహించని రీతిలో డిస్ట్రక్టివ్ బ్యాటింగ్ చేసే డెవిలియర్స్ 16 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేశాడు.సౌతాఫ్రికా ఆటగాడు డెవిలియర్స్ 2015వ సంవ్సరం జనవరి 18వ తేదీన వెస్టిండిస్ తో జరిగిన మ్యాచ్ లో ఈ రికార్డు సాధించి వన్ డే క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ సాధించాడు.
Advertisement
కాలిన్ మున్రో
కాలిన్ మున్రో కేవలం 14 బంతుల్లోనే అర్థసెంచరీ పూర్తిచేశాడు. మున్రోను డేంజరెస్ బ్యాట్స్ మెన్ అని అంతా పిలుస్తారు. 2016 సంవత్సరం జనవరి 10వ తేదీన శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో లంక బౌలర్లపై విరుచుకుపడ్డాడు. టీట్వంటీ చరిత్రలోనే ఇది రికార్డుగా నిలిచిపోయింది.
యువరాజ్ సింగ్
సిక్సర్ ల కింగ్ యువరాజ్ సింగ్ 2007వ సంవత్సరంలో ఇంగ్లాండ్ తో చరిగిన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లో రెచ్చిపోయాడు. వరుసగా ఆరు బంతుల్లో ఆరు సిక్స్ లు కొట్టి ఇంగ్లాండ్ బౌలర్లపై దండయాత్ర చేశాడు. బంతుల్లో అర్థ సెంచరీ పూర్తి చేసిన యూవీ క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద రికార్డును క్రియేట్ చేశాడు.