Home » వారు అంత గొప్పగా ఏం చేసారు…?

వారు అంత గొప్పగా ఏం చేసారు…?

by Azhar
Ad

ఆసియా కప్ టోర్నీ 2022 లో పాల్గొనబోయే భారత జట్టును ఇలా ప్రకటించిందో లేదో అలా బీసీసీఐపై విమర్శలు అనేవి మొదలయ్యాయి. ఈ టోర్నీ కోసం 15 మందితో కూడిన జట్టుతో పాటుగా ముగ్గురు స్టాండ్ బై ఆటగాళ్లతో కలిపి 18 మంది పేర్లను ప్రకటించింది. అయితే అందులో కొన్ని పేర్లను చూసి షాక్ అవుతున్న ఫ్యాన్స్.. కొన్ని పేర్లు అనేవి లేకపోవడంతో ఆశ్చర్యపోతున్నారు.

Advertisement

ముఖ్యంగా ఈ జట్టులో సంజూ శాంసన్ కు సెలక్టలు చొక్కు కల్పించకపోవడం ఫ్యాన్స్ కు ఆగ్రహం అనేది తెప్పిస్తుంది. అయితే బీసీసీఐ సెలక్టర్లు అతను మాములుగా ఆడినప్పుడు ప్లేస్ కల్పించకపోతేనే బీసీసీఐని ట్రోల్ చేస్తారు. కానీ ఇప్పుడు సంజూ మంచి టచ్ లో కనిపిస్తున్నాడు. అందువల్ల అతను ఈ ఆసియా టోర్నీలో ఆడుతాడు అని అందరూ అనుకున్నారు. కానీ బీసీసీఐ సెలక్టర్లు మాత్రం కనీసం స్టాండ్ బై ఆటగాళ్లలో కూడా సంజూకి స్థానం అనేది ఇవ్వలేదు.

Advertisement

సంజూ ఓపెనర్ గా.. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ గా అలాగే వికెట్ కీపర్ గా పనికివస్తాడు. కానీ ఈ జట్టులో ఐపీఎల్ తర్వాత నుండి ఒక్క మ్యాచ్ కూడా ఆడని రాహుల్ ను ఓపెనర్ గా ఎంపిక చేసిన బీసీసీఐ.. ఈ ఏడాది ఆరంభం నుండి పరుగులు చేయడానికి కష్టపడుతున్న పంత్ ను కీపర్ గా ఎంపిక చేసింది. కానీ ఈ ఏడాది అద్భుతంగా ఆడుతున్న సంజూని ఎంపిక చేయకపోవడంతో వారు ఇప్పుడు సంజూ కంటే అంత గొప్పగా ఏం చేసారు అని బీసీసీఐని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

ఆసియా కప్ టోర్నీ జట్టును ప్రకటించిన బీసీసీఐ..!

గోల్డ్ రాకపోవడానికి కారణం అదే..!

Visitors Are Also Reading