Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » గోల్డ్ రాకపోవడానికి కారణం అదే..!

గోల్డ్ రాకపోవడానికి కారణం అదే..!

by Azhar
Ads

కామన్వెల్త్ గేమ్స్ లో నిన్న ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ లో మన జట్టు ఓడిపోయిన విషయం తెలిసిందే. 162 పరుగుల లక్ష్యాన్ని కష్టంగా మొదలు పెట్టిన టీ ఇండియా ఆ తర్వాత విజయంకు చాల దగ్గరగా వెళ్ళింది. కానీ ఆ తర్వాత చివర్లో ఆరుసగా వికెట్లు కోల్పోయి ఓడిపోయింది. కేవలం 13 పరుగుల వ్యవధిలోనే 5 వికెట్లు కోల్పోయి 9 పరుగుల తేడాతో బంగారం మిస్ చేసుకుంది.

Advertisement

Ad

ఇక భారత జట్టు ఓటమిపై జట్టు కెప్టెన్ హర్మాన్ ప్రీత్ కౌర్ మాట్లాడింది. మొదట ఆమె బ్యాటింగ్ లో జరిగిన తప్పులను ఒప్పుకుంది.ఆ తర్వాత ఇలా మెగా టోర్నీలలో చేసే తప్పుల గురించి చెప్పింది. టీం ఇండియా ఇలానే ఫైనల్ లో చివరగా జరిగిన రెండు ప్రపంచ కప్స్ లో కూడా ఓడిపోయింది. అయితే మేము ఈ మెగా టోర్నీలలో ఎప్పుడు ఒక్కే రకమైన తప్పులు అనేవి చేస్తున్నం అని హర్మాన్ పేర్కొంది.

మేము మాములుగా లీగ్ మ్యాచ్ లలో కానీ… ద్వైపాక్షిక సిరీస్ లలో గని ఈ తప్పులు అనేవి చెయ్యము. కానీ మెగా టోర్నీలు అవి కూడా ఫైనల్ మ్యాచ్ అనగానే ఒక్కే రకమైన తప్పు అనేది చేస్తాం. ఆ సమయంలో మా బుర్రను ఫైనల్స్ అనే ఫోబియా కమ్మేస్తుంది అని చెప్పింది. ఇక మా జట్టులో ఇంకా ఒక్క బ్యాటర్ అవసరం ఉంది అని చెప్పిన హర్మాన్.. మాకు ఇంకా అలంటి వారు దొరకలేదు అని చెప్పింది.

Advertisement

ఇవి కూడా చదవండి :

ఫైనల్ లో ఆస్ట్రేలియా చీటింగ్..! 

ఆసియా కప్ కు బుమ్రా కూడా మిస్..!

Visitors Are Also Reading