ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూసిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ప్రారంభమైపోయింది. ఇవాళ మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య వన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్ లో భాగంగా మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్ లో మొదట టాస్క్ నెగ్గిన టీమిండియా జట్టు… బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ కు దిగింది పాకిస్తాన్ జట్టు.
అయితే ఈ మ్యాచ్ లో ఆది నుంచి పాకిస్తాన్ జట్టు కష్టాల్లో ఉన్నట్లే కనిపించింది. ఒక్కో పరుగు అష్ట కష్టంగా చేస్తున్నారు పాకిస్తాన్ ప్లేయర్లు. ఈ నేపథ్యంలోనే 168 పరుగులకు ఏకంగా ఆరు వికెట్లు కోల్పోయింది పాకిస్తాన్ జట్టు. రిజ్వాన్ మరియు బాబర్ మాత్రమే రాణించి ఆ మాత్రం స్కోర్ చేయగలిగారు. సింపుల్గా చెప్పాలంటే పాకిస్తాన్ టాప్ ఆర్డర్ మొత్తం కుప్పకూలిందన్నమాట.
Advertisement
Advertisement
అయితే ఈ మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా ఓ మ్యాజిక్ చేశాడు. ఈ మ్యాచ్ లో 13వ ఓవర్ వేసిన ఆర్థిక పాండ్యా… పాక్ బ్యాటర్ ఇమామ్ ఉల్ హక్ ను అవుట్ చేశాడు. అతన్ని అవుట్ చేసే ముందు బంతితో.. క్షుద్ర పూజలు చేసినట్లు హార్దిక్ పాండ్యా… ఏదో మంత్రం చదివాడు. ఆ తర్వాత వెంటనే పాక్ బ్యాటర్ కీపర్ క్యాచ్ గా వెనిదిరిగాడు. దీంతో హార్దిక్ పాండ్యా క్షుద్ర పూజలు నేర్చుకున్నాడని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
ఇవి కూడా చదవండి
- Renu Desai : గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న పవన్ మాజీ భార్య
- బన్నీ సినిమా కోసం ఊర్వశి కొత్త డిమాండ్లు… కోట్లు ఇవ్వాల్సిందేనని ?
- Mahalakshmi : దారుణంగా ట్రోలింగ్…నటి మహాలక్ష్మి పై రవీందర్ సంచలన వ్యాఖ్యలు !