Home » మ‌న దేశంలో ఫ్యాన్ రెక్క‌లు 3.. అమెరికాలో 4 రెక్క‌లు ఎందుకు ఉంటాయో తెలుసా?

మ‌న దేశంలో ఫ్యాన్ రెక్క‌లు 3.. అమెరికాలో 4 రెక్క‌లు ఎందుకు ఉంటాయో తెలుసా?

by Bunty
Ad

మ‌న దేశంలో ఎక్క‌డ చూసిన ఎక్కువ శాతం మూడు రెక్క‌ల ఫ్యాన్స్ మాత్ర‌మే క‌నిపిస్తాయి. చాలా త‌క్కువగా నాల‌గు రెక్క‌ల ఫ్యాన్స్ క‌నిపిస్తాయి. అదే అమెరికాలో మాత్రం వందకు వంద శాతం 4 రెక్క‌ల ఫ్యాన్స్ ఉంటాయి. అమెరికాతో పాటు కెన‌డా వంటి దేశాల్లో ఫ్యాన్ల కు నాలుగు రెక్కలు ఉంటాయి. అయితే మ‌న దేశంలో కేవ‌లం 3 రెక్కలు ఉండి అమెరికా, కెన‌డా వంటి దేశాల్లో నాలుగు రెక్క‌లు ఎందుక‌ని ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

అమెరికాలో, కెన‌డా వంటి దేశాలలో చ‌లి ఎక్కువ గా ఉంటుంది. అందుకే స‌మ‌యం వ‌చ్చిన ప్ర‌తిసారి ఉష్ణోగ్ర‌త‌ను మార్చు కోవ‌డానికి ఎయిర్ కండిష‌న‌ర్ ల‌ను వాడుతారు. చ‌లి ఎక్కువ ఉంటుంది కాబ‌ట్టి గ‌ది ఉష్ణోగ్ర‌త‌ను ఏసీల తో ఎక్కువ చేసుకుంటారు. అయితే ఏసీ ద్వారా వ‌చ్చే గాలిని గ‌ది అంతంటా వ్యాప్తి చెంద‌దు. దీంతో నాలుగు రెక్క‌లు ఉన్న ఫ్యాన్ల వాడుతారు. ఈ నాలుగు రెక్క‌లు ఉన్న ఫ్యాన్ల వ‌ల్ల ఏసీ నుంచి వ‌చ్చే గాలి నాలుగు వైపుల వ్యాప్తి చెందుతుంది. నాలుగు రెక్కలు ఉన్న ఫ్యాన్లు నెమ్మ‌దిగా గాలిని వ్యాప్తి చెస్తాయి.

Advertisement


అలాగే ఫ్యాన్లకు నాలుగు రెక్కలు ఉండడం వ‌ల్ల ఫ్యాన్ మోటార్ పై ఎక్కువ ఒత్తిడి పడుతుంది. దీంతో నాలుగు రెక్కలున్న ఫ్యాన్లు మూడు రెక్క‌లు ఉన్న ఫ్యాన్ల క‌న్న‌ తక్కువ సామర్ధ్యం తో పని చేస్తాయి. అయితే అమెరికా తో పాటు కెనడ దేశాల్లో త‌క్కువ సామ‌ర్థ్యం ఉన్న ఫ్యాన్లు స‌రిపోతాయి. ఎందుకంటే వారి ద‌గ్గ‌ర త‌ప్ప‌కుండా ఏసీలు ఉంటాయి. ఎందుకంటే అక్కడ అంద‌రూ ఏసీల‌ను త‌ప్ప‌క కొనుగోలు చేస్తారు. అయితే మ‌న దేశం లాంటి ఎక్కువ ఉష్ణోగ్ర‌త‌లు ఉన్న దేశాల్లో గాలిని వేగం గా గ‌ది మొత్తం వ‌చ్చేలా ఉండాలి. అందుకే ఇక్క‌డ మూడు రెక్క‌ల ఫ్యాన్ల‌ను వాడుతారు.

Visitors Are Also Reading