F2 మూవీ కామెడీ కి పెట్టింది పేరు. ఇందులో నటీనటుల కామెడీ మాత్రం మామూలుగా లేదని చెప్పవచ్చు. ప్రస్తుతం దీనికి సీక్వెల్ F3 మూవీ థియేటర్లలోకి రాబోతోంది. ఈ రెండిట్లో నటించిన నటుడు ప్రదీప్ అంటే తెలియని వారు ఉండరు.. అంతేగా అంతేగా అంటూ డైలాగుతో అందరినీ ఆకట్టుకున్నారాయన. ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఆయన హీరో అచ్యుత్ గురించి ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. అవేంటో ఒకసారి చూద్దాం..? ఇంద్రధనస్సు సీరియల్ ద్వారా తెలుగు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన అచ్యుత్ వరుస సినిమాలతో చాలా బిజీ అయ్యారు. సీరియల్స్ విషయానికి వస్తే టాప్ హీరోగా కొనసాగారు. ఎంత తొందరగా పేరు తెచ్చుకున్నారో అంతే త్వరగా 40 ఏళ్ల వయసులో హార్టటాక్ ద్వారా మృతి చెందారు. దీనికి ప్రధాన కారణం ఆయన ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం వల్లనే అని అప్పట్లో వార్తలు వచ్చాయి.కానీ మరణానికి సంబంధించిన అసలు విషయాలను ప్రదీప్ తెలియజేశారు. అచ్యుత్ మాంసాహారం, స్మోకింగ్ పూర్తిగా మానేసిన అధిక ఒత్తిడి కారణంగా మరణించారని తెలియజేశారు. ఆయన సీరియల్స్ లో సూపర్ స్టార్ అవ్వడం వలన పనిభారం పెరిగి ఎంతో ఒత్తిడికి గురై మృతి చెందారు. అయితే 40 సంవత్సరాల వయసులో అందరికీ గుండె ఒక అలారం ఇస్తుందని, కానీ అచ్యుత్ ఆ విషయంలో నెగ్లెట్ చేసి అధికంగా కూల్డ్రింక్స్, స్వీట్స్ తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయి పెరిగి గుండెపోటు వచ్చిందని అన్నారు. ఆయన ముందుగా గుర్తించడం పోవడం వల్ల ఈ పరిస్థితి చేజారిపోయిందని తెలియజేసారు.గుండెపోటు రావడానికి ఒక రోజు ముందు నేను ఆయన కలిసి మట్టి మనషులు సీరియల్ లో షూటింగ్ లో ఉన్నామని, రేపు ఉదయం కృష్ణ ఎక్స్ ప్రెస్ లో తిరుపతికి వెళుతున్న అని చెప్పాడు. కానీ ఉదయం అన్నపూర్ణ స్టూడియోలో నేను ఉండగా అచ్యుత్ కి గుండెపోటు వచ్చిందని ఫోన్ వచ్చింది. వెంటనే అక్కడికి వెళ్ళాను కానీ తన భార్య మాత్రమే ఉంది. నేను పెద్ద ప్రమాదమేమీ ఉండదు అనుకున్నా కాని డాక్టర్లు 99% బ్రతికే అవకాశం లేదని ఒక్క శాతం మాత్రమే అవకాశం ఉందని అన్నారు. కానీ ఆయన మరణించారు. ఇందులో బాధాకర విషయం ఏమిటంటే ఆయన భార్యకు కూడా నేనే చెప్పాల్సివచ్చింది. నా తండ్రి మరణం కంటే అచ్యుత్ మరణం నన్ను చాలా బాధ పెట్టిందని అచ్యుత్ కు తనకు ఉన్న సంబంధాన్ని వివరించారు.
Advertisement
ALSO READ;
Advertisement
మేజర్ సినిమాకు సెన్సార్ సెల్యూట్.. 10 రోజుల ముందే స్పెషల్ షోలు..!
రేణుదేశాయ్ గురించి ఆ డైరెక్టర్ ఏమన్నారో తెలుసా..?