ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. దాంతో పెద్దవాళ్లు తమ పిల్లల పెళ్లిల్లు అయినా సరైన దారిలో నడిచేలా చూసుకునేవారు. అంతే కాకుండా భర్త ఉద్యోగం చేస్తే భార్య ఇంటిపనులు చూసుకుంటూ భర్తతో పాటూ పిల్లల అవసరాలను తీరస్తూ ఉండేది. కానీ ప్రస్తుతం సమాజంలో పెళ్లైన వెంటనే తల్లి దండ్రుల నుండి దూరంగా వెళ్లిపోతున్నారు. ఉద్యోగం కోసమో వ్యాపారం కోసోమే దూరంగా వెళ్లిపోతున్నారు. దాంతో భార్య భర్త తప్ప మూడో వ్యక్తి ఉండరు.
వారికి పెళ్లైన తరవాత ఎలా ఉండాలి భార్యను భర్త ఎలా చూసుకోవాలని భార్య భర్తను ఎలా చూసుకోవాలి అనే విషయాలను చెప్పేవారు ఉండరు. దాంతో చిన్న గొడవలు సైతం పెద్దగా మారుతున్న సంధర్బాలు ఉన్నాయి. అంతే కాకుండా బిజీ జీవితంలో ఎవరికి నచ్చినట్టు వాళ్లు ఉండటంతో అక్రమ సంబంధాలు సైతం పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా భర్తలు ఎక్కువగా ఇతర స్త్రీలతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ ఉంటారు. దానికి కారణం మగవాళ్లు ఆఫీసుకు వెళ్లడం…బయట తిరగటం చేస్తారు కాబట్టి తాము పనిచేస్తున్నచోటునో లేదంటే బయటనో పరాయి స్త్రీల వ్యామోహంలో పడే అవకాశం ఉంది.
Advertisement
Advertisement
అయితే భర్తలు అలా పరాయి స్త్రీలతో అక్రమసంబంధాలు పెట్టుకోకుండా ఉండాలంటే భార్యలు కొన్ని సలహాలు సూచనలు పాటించాలని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగానికి వెళ్లి ఇంటికి వచ్చిన భర్తకు భార్య భోజనం పెట్టి అతడితో చక్కగా మాట్లాడాలట. ఆ రోజు ఏం జరిగింది రోజంతా ఎలా గడిచింది ఇలా కబుర్లు చెప్పాలట. దాంతో ఇద్దరి మధ్య బంధం ఇంకా పెరుగుతుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. భార్య తన భర్తకు అందంగా కనిపించేందుకు రెడీ అవ్వాలట.
అలా చేయడం వల్ల తన భార్యతోనే అతడు ప్రేమలో ఉండి పరాయి స్త్రీల జోలికి వెళ్లడట. కుటుంబంలోని సమస్యల గురించి భార్యలు తమ భర్తలకు చెబుతూ ఉండాలట. అలా సమస్యలు చెప్పడం వల్ల భర్త మనసు ఇతర విషయాల వైపు మల్లకుండా కుటుంబ సమస్యలపై దృష్టి పెడతారట. అంతే కాకుండా భార్యలు భర్తలతో చిన్న చిన్న విషయాలకు గట్టిగట్టిగా అరవకుండా ప్రేమగా మాట్లాడాలట. అరవడం వల్ల చిరాకు పుట్టి భర్త ఇతర స్త్రీలకు దగ్గర అయ్యే అవకాశాలు ఉన్నాయట.