కూతురు ఉన్న ప్రతి తండ్రి కూడా ఈ విషయాలు తెలుసుకోవాలి. కూతురుని చక్కగా చూసుకోవాలని ప్రతి ఒక్క తండ్రి కూడా అనుకుంటాడు. తండ్రులతో మంచి సంబంధం లేకుండా సరైన కమ్యూనికేషన్ లేని అమ్మాయిలలో డిప్రెషన్ ఎక్కువగా ఉంటుందని పరిశోధన చెప్తోంది. సరైన కమ్యూనికేషన్ తండ్రితో పిల్లలకి లేకపోతే ఒంటరిగా అనిపిస్తూ ఉంటుందట. ప్రతి అమ్మాయి జీవితంలో అత్యంత సన్నిహితంగా ఉండే మొదటి పురుషుడు తండ్రి. పిల్లలు తన తండ్రితో ఆనందాన్ని దుఃఖాన్ని కూడా పంచుకోగలగాలి. ఇది వాళ్లని ధైర్యంగా మారుస్తుంది. ఒంటరి తత్వాన్ని కలిగించదు.
Advertisement
Advertisement
అలానే ప్రతి బిడ్డ తన తండ్రి అవసరాలని అర్థం చేసుకోవాలి. ప్రత్యేక సమయాన్ని తండ్రి పిల్లల కోసం కేటాయించాలి. వాళ్ల రోజు ఎలా గడిచింది, ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఆనందంగా ఉన్నారా లేదా ఇటువంటివి తల్లిదండ్రులు కచ్చితంగా తెలుసుకోవాలి. ముఖ్యంగా తండ్రి తెలుసుకోవాలి. ప్రతి అమ్మాయి కూడా తనకి కాబోయే భాగస్వామి తన తండ్రిలా ఉండాలని ఆశపడుతుంది తండ్రి తన తల్లిని బాగా చూడనప్పుడు పెళ్లి గురించి ఆమెలో భయం కలుగుతుంది. అలానే తండ్రి ఎప్పుడు సపోర్టు ఇవ్వాలి. ఏ రూల్స్ లేకుండా తన తండ్రి ఎప్పుడు తనని ప్రేమించాలని కూతురు ఆశ పడుతూ ఉంటుంది. తండ్రులు కచ్చితంగా ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని ఆచరిస్తే కూతురు లైఫ్ బాగుంటుంది.
Also read:
- పిల్లల జ్ఞాపక శక్తి పెరగాలంటే.. రోజూ ఇవి పెట్టండి…!
- చాణక్య నీతి: ఈ ఆరుగురికి అస్సలు శత్రువులుగా ఉండకండి… నష్టమే ఉంటుంది…!
- కరివేపాకు మొక్క బాగా ఎదగట్లేదా..? ఈ టిప్స్ పాటిస్తే.. ఏపుగా పెరుగుతుంది..!