Home » ఆ రోజు హైదరాబాద్ లో కూడా నీడ కనిపించదు.. అది ఎప్పుడంటే?

ఆ రోజు హైదరాబాద్ లో కూడా నీడ కనిపించదు.. అది ఎప్పుడంటే?

by Anji
Ad

ఇటీవల బెంగళూరులో ఓ అద్భుత ఘటన చోటు చేసుకున్న విషయం దాదాపు అందరికీ తెలిసిందే. ఏప్రిల్ 25 బెంగళూరు పట్టణంతో పాటు సమీప ప్రాంతాల్లో జీరో షాడో డే ఆవిష్కృతమైంది. జీరో షాడో డే అనగా..?  సూర్యుడు వెలుగు దేనిమీద అయినా పడుతుండగా.. దాని నీడ మనకు కనిపించదు. శాస్త్రవేత్తలు చెబుతున్న ప్రకారం.. ఏప్రిల్ 25న మధ్యాహ్నం 12.17 గంటలకు బెంగళూరులో ది ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఆస్ట్రోఫిజిక్స్‌ క్యాంపస్‌లో 60 నుంచి 120 సెకండ్లపాటు పొడవైన వస్తువుల నీడ కనిపించలేదు. ఈ అద్భుతమైన దృశ్యాన్ని చాలా మంది చూశారు. అలాగే ఈ సారి హైదరాబాద్ వాసులకు కూడా ఈ అద్భుతాన్ని చూసే అవకాశం రానుందంట. హైదరాబాద్ లో జీరో షాడో డే ఎప్పుడో అనే వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Also Read :   పోసాని పై సంచలన వ్యాఖ్యలు చేసిన నటుడు శివాజీ.. అందుకోసమేనా ?

Advertisement

Advertisement

 బెంగుళూరులో నగరంలో ఏప్రిల్ 25, 2023న జీరో షాడో డే ఏర్పడింది. దాదాపు మూడు నిమిషాల పాటు నీడ భూమిపై అస్సలు కనిపించలేదు. ఈ అరుదైన దృశ్యాన్ని బెంగుళురు వాసులు ఆస్వాదించారు. అయితే జీరో షాడో డే గా పిలిచే ఈ అసాధారణమైన సంఘటనను చూసే అవకాశం హైదరాబాద్ వాసులకు కూడా కలిగింది. మే 9, 2023 మధ్యాహ్నం 12:12 గంటలకు ఈ అరుదైన ఘటన ఆవిష్కృతం కానున్నట్టు సమాచారం. సాధారణంగా కర్కాటక రాశి, మకర రాశి మధ్య ప్రాంతాలలో జీరో షాడో ఏర్పడుతుంది. ఈ ప్రాంతాలలో నివసించే ప్రజలకు, ఉత్తరాయణం, దక్షిణాయనం రెండింటిలో కూడా సూర్యుని క్షీణత అక్కడి అక్షాంశానికి సమానంగా ఉంటుంది. 

Also Read :  Silk Smitha : భరించలేని నరకం.. చనిపోయే ముందు ఉత్తరంలో బాధను బయటపెట్టిన సిల్క్ స్మిత ?..

ఇక ఆ సమయంలో సూర్య కిరణాలు భూమిపై నిట్ట నిలువునా పడుతాయి. అందువల్ల నిలువుగా ఉండే ఏదైనా వస్తువు లేదా జీవులు నీడను ఏర్పచలేదు. ఈ ఘటన ఏడాదికి రెండుసార్లు సంభవిస్తుంది. ఇటీవలే బెంగళూరు ఏర్పడిన ఈ జీరో షాడో డే.. మే 9న హైదరాబాద్ లో కనువిందు చేయనుంది. హైదరాబాద్‌లో జీరో షాడో డే మే 9 మధ్యాహ్నం 12:12 గంటల సమయంలో ఏర్పడనుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఈ ఏడాది ఆగస్టు 18న కూడా ఇలా జరగనుందట. గతంలో 2021లో ఒడిశా రాజధాని నగరమైనటువంటి భువనేశ్వర్‌లో ఈ అద్భుతం జరిగింది. 

 Also Read :  సమంత ఒక్క పోస్ట్ కి ఎంత తీసుకుంటుందో తెలుసా…హీరోలు కూడా పనికిరారు?

Visitors Are Also Reading