ప్రస్తుతం టాలీవుడ్ ను ఏలుతున్న మన హీరోలు చదువులోనూ రాణించారు. ఎక్కువ మంది హీరోలు భాగా చదువుకున్న తరవాతే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక మరికొందరు మధ్యలోనే చదువుకు పులిస్టాప్ పెట్టారు. అయితే ఏ హీరో ఎంత చదువుకున్నాడు అనే విషయం తెలుసుకోవాలని అభిమానులకు ఉంటుంది. కాబట్టి ఏ హీరో ఎంతవరకూ చదువుకున్నాడు అనేది ఇప్పుడు చూద్దాం….టాలీవుడ్ కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ మరియు మ్యాచో మ్యాన్ గోపీచంద్ లు ఫారిన్ లో పై చదువులు పూర్తి చేశారట ఆ తరవాతే సినిమాల్లో వచ్చారట. ఇక అల్లుఅర్జున్, మహేశ్ బాబు డిగ్రీ పూర్తిచేశారు. అంతే కాకుండా ప్రభాస్ బీటెక్ పూర్తి చేశాడు.
ఇండస్ట్రీని ఇప్పటికీ ఏలుతున్న మెగాస్టార్ చిరంజీవి ఢిగ్రీ వరకూ చదువుకున్నారు. ఢిగ్రీలో మెగాస్టార్ కామర్స్ కోర్సును పూర్తి చేశారు. అంతే కాకుండా ఆయన వైఎన్ కాలేజీ నరసాపురంలో ఢిగ్రీని పూర్తి చేశారు.
Advertisement
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇంటర్ వరకు మాత్రమే చదువుకున్నారట. హైదరాబాద్ లోని సెయింట్ మేరీస్ కాలేజీలో ఆయన ఇంటర్ పూర్తి చేశారట. కానీ నటనలో మాత్రం ఎన్టీఆర్ పీహెచ్డీ చేశారనే చెప్పాలి.
Advertisement
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా ఇంటర్ పూర్తి చేశారు. అయితే పవన్ అకాడమిక్ చదువులకు దూరంగా ఉన్నా ఎన్నో ఫిలాసఫీ మరియు గొప్ప వ్యక్తుల జీవిత కథలను చదివారు. ప్రస్తుతం ఆయన సినిమాలతో పాటూ రాజకీయాల్లోనూ చురుగ్గా ఉన్నారు.
ఇక విక్టరీ వెంకటేశ్ అమెరికాలో ఎంబీఏ పూర్తి చేశారు. ఆ తరవాత సినిమాలపై ఉన్న ఆసక్తితో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు.
నందమూరి బాలయ్య డిగ్రీ వరకూ చదువుకున్నారు. అంతే కాకుండా ఆయన హైదరాబాద్ లోని ప్రసిద్ధ నిజాంకళాశాల లో డిగ్రీని పూర్తి చేశారు. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఎమ్మెల్యేగా ప్రజాసేవ చేస్తున్నారు.