చంద్రయాన్ 3 ప్రయోగం సక్సెస్ అయింది. జాబిల్లి మీద దిగిన విక్రమ్ లాండర్ నుండి ప్రగ్యాన్ రోవర్ బయటకి వచ్చి పరిశోధనలు చేస్తున్న విషయం తెలిసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా ట్విట్టర్ లో ఇస్రో ఎప్పుడు పంచుకుంటూనే ఉంటుంది. ఈ చంద్రయాన్-3 మిషన్‌కు ప్రధాన శాస్త్రవేత్త పి.వీరముత్తువేల్ నాయకత్వాన్ని వహించారు. మిషన్ డైరెక్టర్‌గా కల్పన ఇస్రోలో అసోసియేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా శ్రీకాంత్ పనిచేశారు. ఎం.శంకరన్ డైరెక్టర్ గా, సోమనాథ్ ఇస్రోలో చైర్మన్ పదవిలో విధులు పూర్తి చేసారు. అస్సాంకు చెందిన శాస్త్రవేత్త చయాన్ దత్తా కూడా ఈ మిషన్ లో తన విధుల ని నిర్వహించారు. ఇక వీళ్ళ విద్యార్హతలు గురించి క్లుప్తంగా చూద్దాం.
S. సోమనాథ్:
Advertisement
డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్‌లో సెక్రటరీగా, స్పేస్ కమిషన్ చైర్‌పర్సన్‌గా సోమనాధ్ ఉన్నారు, కొల్లాంలోని TKM కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో ఈయన మెకానికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ పట్టా పొందారు. బెంగళూరులోని ప్రఖ్యాత ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ ని పూర్తి చేశారు. గోల్డ్ మెడల్ కూడా ఆయన సాధించారు.
ఎం. శంకరన్:
UR రావు శాటిలైట్ సెంటర్ (URSC)కి నాయకత్వం వహించారు ఈయన. 1986లో తిరుచిరాపల్లిలోని భారతి దాసన్ విశ్వవిద్యాలయం లో భౌతిక శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేసారు. ఆ తరవాత ఇస్రో లో చేరారు. భారతదేశ అంతరిక్ష పరిశోధన విజయాలలో ముఖ్య పాత్ర పోషించారు.
డా. వి. నారాయణన్:
Advertisement
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) లో ఈయన కూడా ముఖ్య పాత్ర పోషించారు. డాక్టర్ నారాయణన్ ఖరగ్‌పూర్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో చదువుకున్నారు. 1989లో ఎంటెక్ చేసారు. ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో PhD కూడా చేసారు. ఆస్ట్రోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా నుండి బంగారు పతకం వచ్చింది. IIT ఖరగ్‌పూర్ నుండి ఎంటెక్ లో టాప్ రావడంతో రజత పతకము వచ్చింది.
డా. ఎస్. ఉన్నికృష్ణన్ నాయర్:
తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం (VSSC), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ (IIST) రెండింటికీ కూడా డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. కేరళ విశ్వవిద్యాలయం నుండి మెకానికల్ ఇంజినీరింగ్‌లో బిటెక్ పూర్తి చేసారు. IISc బెంగళూరు నుండి ME చేసారు. IIT మద్రాస్ నుండి మెకానికల్ ఇంజనీరింగ్‌లో PhD పట్టా పొందారు. నల్సార్ నుండి టెలికమ్యూనికేషన్స్ మరియు స్పేస్ లాలో MA కూడా చేసారు. 1985లో తిరువనంతపురం లోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌లో పని చేయడం తో కెరీర్ మొదలైంది. అంతరిక్ష పరిశోధనలోని వివిధ అంశాలలో కీలక పాత్ర పోషించారు. 2007లో స్పేస్ క్యాప్సూల్ రికవరీ ఎక్స్‌పెరిమెంట్ (SRE)లో కూడా సక్సెస్ ని అందుకున్నారు.
Also read:
- ఇలా కోడలు చేస్తే.. అత్తతో గొడవలే వుండవు..!
- క్యాండీ లో భారత్, పాక్ మ్యాచ్.. ఇరు జట్ల ప్రదర్శన ఇక్కడ ఎలా ఉందంటే..?
- ఓనమ్ పాటతో అనుపమ.. వావ్ ఎంత క్యూట్ గా పాడిందో చూసారా..?