ఆధునిక యుగం డబ్బు చుట్టూ పరిగెడుతున్నారు తప్ప ఏది మంచి, ఏది చెడు అని ఆలోచించే సమయం లేకుండా పోతోంది. అది మనం ధరించే బట్టలు నుండి మనం తినే ఆహారం వరకు మారిపోయింది. దీంతో చిన్నచిన్న వ్యాధుల బారిన పడి మరణిస్తున్నారు. దీనికి కారణం మనం తినాల్సినవి తినకపోవడం, తినకూడనివి ఎక్కువగా తినడం. ప్రస్తుతం జనరేషన్ కి చక్కెర అంటే తెలుసు కానీ బెల్లం అంటే ఎక్కువగా పరిచయం లేదు. కానీ ఆ బెల్లం తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఓ సారి చూద్దాం.
Advertisement
ప్రతిరోజూ క్రమం తప్పకుండా బెల్లం ముక్క తినాలని మన పెద్దవారు ఎప్పుడూ చెబుతూనే ఉంటారు. మనం బెల్లం తినడం వల్ల రక్తం శుద్ధి జరిగి వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. అలాగే లివర్ లో ఉండే వ్యర్థాలను బయటకు పంపి, పనితీరు బాగుండేలా చేస్తుంది. అలాగే బెల్లం జీర్ణానికి సంబంధించిన సమస్యలను కూడా దూరం చేస్తుందట. బెల్లం తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుందని చాలామంది ఆరోగ్య నిపుణులతో పాటు పెద్దలు కూడా చెబుతూ ఉంటారు. బెల్లనికి ప్రత్యేకమైన గుణం రక్త హీనతను నివారించడం. రక్తంలో హీమోగ్లోబిన్ శాతాన్ని పెంచే గుణాన్ని, బెల్లం కలిగి ఉండడం విశేషం. అలాగే జ్ఞాపకశక్తిని పెంచడానికి, బెల్లం చాలా ఉపయోగపడుతుంది.
Advertisement
దుమ్ము ఎలర్జీలతో ఇబ్బందులు ఎదుర్కొనే వారికి బెల్లం మంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. కీళ్ల నొప్పులతో ఇబ్బందులు పడేవారు బెల్లంలో అల్లాన్ని చేర్చి ప్రతిరోజు తింటే నొప్పిలో కొంత ఉపశమనం లభిస్తుంది. పాలలో పంచదారకు బదులు బెల్లాన్ని కలుపుకొని తాగితే ఎముకలు బలంగా ఉంటాయి. అధిక బరువును తగ్గించుకోవాలంటే బెల్లం మంచి ఔషధంగా పనిచేస్తుంది. ప్రతిరోజు చిన్న బెల్లం ముక్క తినడం వల్ల రక్తపోటును కూడా అదుపులో ఉంచుకోవచ్చు. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న బెల్లాన్ని మీరు ఇప్పుడే ట్రై చేయండి.
ALSO READ:
- మీరు డయాబెటిస్తో బాధపడుతున్నారా..? అయితే ఈ సూప్స్ తాగితే కచ్చితంగా డయాబెటిస్ కంట్రోల్లో ఉంటుంది..!
- తెలంగాణలో ఎంసెట్ వాయిదా.. భారీ వర్షాల కారణంగా అధికారులు కీలక నిర్ణయం..!