ఉరుకుల పరుగుల జీవితం ఒత్తిడితో కూడిన ఉద్యోగం, అనారోగ్యమైన ఆహారపు అలవాట్లు ఆరోగ్యాన్ని పాడు చేసే సరికొత్త పోకడలు ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలతో నేటి రోజుల్లో జనాలు బాధపడుతున్నారు. సాధారణంగా మనిషి జీవన శైలిలో తినడానికి, పడుకోవడానికి, ఉదయం నిద్ర లేవడానికి ఒక సమయం సందర్భం అంటూ ఉంటుంది. నేటి రోజుల్లో మాత్రం ఆ సమయాన్ని పాటించే వారు చాలా తక్కువ అనే చెప్పాలి. ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు తినడం, ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు పడుకోవడం.. ఇక ఇష్టం వచ్చినప్పుడు నిద్ర లేవడం లాంటివి చేస్తున్నారు.
చాలా మంది పై ఆరోగ్య సమస్యలు దూసుకొచ్చి మీద పడిపోతున్నాయి. ఇక ఈ మధ్యకాలంలో యువత, పెద్దలు అందరూ కూడా ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్య ఏదంటే నిద్రలేమి అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ అధునాతన జీవనశైలిలో ఒత్తిడితో కూడిన లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఈ తరుణంలోనే ఎంతోమంది పడుకున్నప్పటికీ సరిగ్గా నిద్ర పట్టక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఇలా నిద్ర పట్టకపోవడానికి కారణాలు ఏమైనప్పటికీ నిద్ర పట్టడానికి మాత్రం కొన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొన్ని టిప్స్ పాటిస్తే హాయిగా నిద్ర పోవచ్చు. వాటి గురించి ఒకసారి ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
Advertisement
ముఖ్యంగా అరటిపండ్లలో సహజ సిద్ధమైన కార్బోహైడ్రేట్స్ కంటెంట్ ఉంటుంది. అరటి పండ్లు మంచి నిద్రకు సహాయపడతాయి. ఇందులో ప్రోబయోటిక్స్ పెంచడంలో సహాయపడే ఎంజైమ్‌లుంటాయి. ప్రీబయోటిక్స్ తినడం వల్ల మీరు ప్రశాంతంగా నిద్రపోతారు. ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇక వ్యాయామం తర్వాత కోలుకోవడం కోసం చెర్రీస్ తీసుకుంటే మంచిది. ఈ పండు రాత్రి సమయంలో మంచి నిద్ర పోవడానికి ఎంతో సహాయపడుతుంది. మోంట్ మోరెన్సీ టార్ట్ చెర్రీ జ్యూస్ ను రోజుకు రెండుసార్లు 14 రోజులపాటు తాగితే రోజు నిద్ర కంటే మరో 84నిమిషాల పాటు ఎక్కువసేపు నిద్రపోగలరని ఒక అధ్యయనంలో తేలింది.
ఇక ఇందులో మొలటోనిన్ ఉంటుంది. ఇది రాత్రిపూట పీనియర్ గ్రంధి ద్వారా విడుదలయ్యే హార్మోన్. ఇది మీకు రాత్రి సమయంలో గాఢ నిద్రపోవడానికి సహాయపడుతుంది. దీనితో కూడిన చెర్రీలు మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రాత్రి నిద్ర రావాలంటే ఆహారంలో తేనె చేర్చండి. సహజ చక్కెర, తేనె ఇన్సులిన్ స్థాయిలను పెంచుతుంది. ఇది ట్రిప్టో ఫాన్ సెరోటనిన్ లను మెదడుకు ప్రసారం చేయడంలో సహాయపడుతుంది. ఇది శరీరం విశ్రాంతి తీసుకోవడానికి కూడా సహాయపడుతుంది. అదేవిధంగా పడుకోవడానికి రెండు గంటల ముందు రాత్రివేళలో రోజు ఒక కివీ పండు తింటే మీరు గాఢ నిద్రలోకి జారుకున్నట్టే లెక్క. మరొక టిప్ ఏమిటంటే రాత్రి సమయంలో ఆహారం కొంచెం తింటే నిద్ర తొందరగా వస్తుందట.
Also Read :
నిజాయితీగా ప్రేమించినా ఎందుకు రిజెక్ట్ చేస్తారు ….? 5 కారణాలు ఇవేనా…?
ఆ వ్యాధి ఉన్న వారు నీరు తాగే విషయంలో జాగ్రత్త పాటించాల్సిందే..!