సాధారణంగా తులసి అనేక ఔషధ గుణాలు కలిగిన మొక్క. ప్రాచీన కాలంలో అనేక ఆరోగ్య సమస్యలకు తులసిని ఔషధంగా వాడేవారు. ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి, చర్మ వ్యాధులను నివారించడానికి తులసిని ఉపయోగించారు. తులసిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఇన్ఫెక్షన్లతో పోరాడుతాయి. తులసిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ దెబ్బతినకుండా శరీరాన్ని రక్షిస్తాయి. అసిడిటీ ఉన్నవారు ఉదయం ఖాళీ కడుపుతో తులసి ఆకులు నమిలితే తగ్గుతుంది. తులసి నీరు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. ఉదయాన్నే తులసి నీరు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
Advertisement
తులసి ఆకులను తేనెలో ముంచి ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటే జలుబు, తుమ్ములు, దగ్గు, గొంతునొప్పి మొదలైన వాటి నుండి ఉపశమనం పొందవచ్చు. తులసి ఆకులతో టీ తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి ఒత్తిడి తగ్గుతుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో తులసి ఆకులను నమలడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఖాళీ కడుపుతో తులసి నీటిని తాగడం వల్ల బరువు తగ్గుతుంది. జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. తులసి అనేక రుగ్మతలకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. రోజూ తులసి ఆకుల తింటే శరీరం శుభ్రంగా ఉంటుంది. తులసి ఆకులు, పసుపు పొడి వేసి మరిగించిన నీటిని తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు, గొంతు సమస్యలను తగ్గిస్తుంది. కడుపు నొప్పి, ఉబ్బరం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.
Advertisement
తులసిలో ఉండే యూజీనాల్ అనే సమ్మేళనం టైప్ 2 డయాబెటిస్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. తులసి ఆకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. తులసిలో శరీరంలో మంటను తగ్గించే సమ్మేళనాలు ఉన్నాయి. ధమనుల వాపును తగ్గించడం ద్వారా, తులసి ఆరోగ్యకరమైన రక్త ప్రవాహాన్ని నిర్వహించడానికి, కొలెస్ట్రాల్ సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కాబట్టి రోజూ ఉదయాన్నే తులసి టీ తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. తులసి నీరు తాగడం వల్ల మలబద్ధకం, విరేచనాల సమస్యలు తగ్గుతాయి. జీర్ణ సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు. తులసిలో ఉండే ఔషద గుణాలు వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల వచ్చే జ్వరం త్వరగా తగ్గిస్తాయి.
Also Read : ఈ ఆకులు అమృతంతో సమానం.. వీటిని ఎలా వాడాలంటే..?