గొంతు నొప్పితో బాధపడుతున్నారా..? ఉపసమనం కలగడానికి చూస్తున్నారా..? గొంతు నొప్పి నుండి ఉపశమనం కలగాలంటే ఇలా చేయండి వెంటనే ఉపశమనం కనిపిస్తుంది గొంతు వాపుని, నొప్పిని అల్లం టీ బాగా తగ్గిస్తుంది. అల్లం టీతో జీర్ణ సమస్యలు కూడా తగ్గిపోతాయి. గొంతు నొప్పి నుండి వెంటనే ఉపశమనం కూడా కలుగుతుంది. చామంతి టీ తాగితే కూడా బాగా పనిచేస్తుంది. వీటిలో ఉన్న ఔషధ గుణాలు గొంతు నొప్పి బాగా తగ్గిస్తాయి గొంతు నొప్పితో బాధపడే వాళ్ళు గోరువెచ్చని ఉప్పు నీటిని పుక్కిలిస్తే కూడా మంచి ఫలితం ఉంటుంది.
Advertisement
Advertisement
వేడి నీళ్ళని తీసుకుంటూ ఉండండి వెంటనే రిలీఫ్ కలుగుతుంది లేదంటే మీరు వేడివేడి సూప్స్ ని కూడా తాగచ్చు. ఇవి కూడా గొంతు నొప్పి నుండి రిలీఫ్ ని కలిగిస్తాయి. గొంతు మంట నొప్పి ఉంటే, నాన్ వెజ్ సూప్ లేదంటే వెజ్ సూప్ తీసుకోవచ్చు. పాలల్లో కొంచెం పసుపు వేసుకుని తీసుకుంటే కూడా మంచి ఫలితం ఉంటుంది పుదీనా కలిపిన నీళ్ళని తీసుకుంటే కూడా గొంతు నొప్పి నుండి త్వరగా ఉపశమనం లభిస్తుంది. ఇలా గొంతు నొప్పితో బాధపడే వాళ్ళు చిన్న చిన్న చిట్కాలతో వెంటనే ఉపశమనాన్ని పొందవచ్చు.
ఆరోగ్య చిట్కాల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!