Home » రాత్రిళ్ళు మంచి నిద్రని పొందలేకపోతున్నారా..? ఇలా చేస్తే.. 15 నిమిషాల్లోనే నిద్రపోవచ్చు…!

రాత్రిళ్ళు మంచి నిద్రని పొందలేకపోతున్నారా..? ఇలా చేస్తే.. 15 నిమిషాల్లోనే నిద్రపోవచ్చు…!

by Sravya
Ad

నిద్ర మనకి చాలా ముఖ్యమైనది. నిద్ర లేకపోతే ఆరోగ్యం కూడా బాగోదు. చాలామంది రాత్రిపూట నిద్రపోవడానికి కష్టపడుతూ ఉంటారు. మీరు కూడా సరిగా నిద్ర పోలేకపోతున్నారా..? అయితే కచ్చితంగా ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోండి ఇలా చేయడం వలన 15 నిమిషాల్లోనే చక్కగా నిద్రపోవచ్చు. రాత్రిపూట నిద్రపోవడానికి సగటున 10 నుండి 20 నిమిషాల సమయం పడుతుంది అని అధ్యయనాలు అంటున్నాయి కానీ ప్రపంచంలో చాలా మంది ప్రజలు సరైన నిద్ర ని పొందలేక బాధపడుతున్నారని అధ్యయనం ద్వారా తెలుస్తోంది.

Advertisement

పడుకున్న తర్వాత 30 నిమిషాల కంటే ఎక్కువ సమయం దాకా నిద్రపోలేకపోతున్నట్లయితే రోగ నిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది దీనివలన శరీరానికి నష్టం జరుగుతుంది. నిద్ర ని పొందడానికి మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి రాత్రిపూట సెల్ ఫోన్ ని ఉపయోగించకండి. విశ్రాంతిగా ఉండాలి. మంచి నిద్రని పొందాలంటే రాత్రిపూట సంగీతాన్ని వింటే మంచిది లేదంటే ఇష్టమైన పుస్తకాలని కూడా చదవచ్చు దీంతో మానసిక ప్రశాంతత కలుగుతుంది.

Advertisement

త్వరగా నిద్ర కూడా పడుతుంది. రోజు నిద్ర సరిగ్గా ఉండాలంటే ఒక షెడ్యూల్ మెయింటైన్ చేయండి ఒకే సమయానికి నిద్రపోయి ఒకే సమయానికి రోజు నిద్ర లేవడం మంచిది. సాయంత్రం పూట రాత్రిపూట స్పైసీ ఫుడ్ ని తినకండి. టీ కాఫీలు తాగకండి వీటివలన నిద్ర పట్టదు. శరీరం, మనసు అలసిపోతే కూడా అసలు నిద్ర పట్టదు రాత్రిళ్ళు నిద్రపోవడానికి ముందు గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే మంచిది. కండరాలు విశ్రాంతి పొందుతాయి. శారీరక అలసట పోతుంది. మనసు ఉల్లాసంగా ఉంటుంది మంచి నిద్ర పడుతుంది.

తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading