Home » ఇంట్లో చీమలు ఎక్కువగా ఉన్నాయా..? ఇలా ఈజీగా వదిలించేయండి…!

ఇంట్లో చీమలు ఎక్కువగా ఉన్నాయా..? ఇలా ఈజీగా వదిలించేయండి…!

by Sravya
Ad

కొంతమంది ఇళ్లలో చీమలు ఎక్కువగా ఉంటాయి. ఎన్ని చేసినా సరే చీమలు బాగా వచ్చేస్తూ ఉంటాయి. చీమల నుండి బయట పడాలంటే ఈ చిట్కాని బాగా పాటించండి. అప్పుడు ఇంట్లో నుండి చీమలు వెళ్ళిపోతాయి. చీమలు మిరియాల వాసనని అస్సలు ఇష్టపడవు. చీమలు ఉన్నచోట మీరు మిరియాల పొడి చల్లండి. లేదంటే నీళ్లల్లో మిరియాల పొడి వేసి స్ప్రే చేయండి. ఇలా చేయడం వలన చీమలు మీ ఇంట్లోకి రావు. నారింజ తొక్కలని చీమలు దీనిని విషయంగా భావిస్తాయి చీమలు తిరిగే చోట నారింజ తొక్కల్ని వేస్తే కూడా చీమలు వెళ్లిపోతాయి. పుల్లటి వాసనని ఇచ్చే నిమ్మకాయ కూడా చీమలని తరిమికొట్టుతుంది.

Advertisement

Advertisement

చీమలు ఉన్నచోట నిమ్మకాయలని పెట్టండి లేదంటే నిమ్మరసం కలిపిన నీళ్ళని చీమల మీద స్ప్రే చేయండి. దాల్చిన చెక్క ఘాటు వాసనని కూడా చీమలు ఇష్టపడవు. చీమలు తిరిగే చోట దాల్చిన చెక్క పొడి నీళ్లలో వేసి స్ప్రే చేయండి అప్పుడు చీమలు రావు. చీమలు తిరిగే చోట వైట్ వెనిగర్ ని స్ప్రే బాటిల్ లో వేసి, స్ప్రే చేస్తే కూడా చీమల నుండి ఈజీగా బయటపడవచ్చు. నీళ్లలో ఉప్పు వేసి మరిగించి స్ప్రే బాటిల్ లో ఈ మిశ్రమాన్ని వేసి చీమలు ఉన్నచోట చల్లితే చీమలు పారిపోతాయి. యూకలిప్టస్ ఆయిల్, వేప నూనె కూడా చీమల్ని తరిమి కొట్టడానికి బాగా పనిచేస్తాయి.

Also read:

Visitors Are Also Reading