Home » టీ పొడితో ఇలా చేస్తే.. వెంట్రుకలు రాలవు..!

టీ పొడితో ఇలా చేస్తే.. వెంట్రుకలు రాలవు..!

by Sravya
Ad

టీ పొడి వలన చాలా రకాల లాభాలని పొందొచ్చు. కేవలం టీ పెట్టుకోవడానికి మాత్రమే కాకుండా జుట్టు రాలిపోవడం వంటి సమస్యలకు కూడా టీ పొడి బాగా ఉపయోగపడుతుంది. ఈ రోజుల్లో చాలామంది జుట్టు రాలిపోవడం వలన ఇబ్బంది పడుతున్నారు. ఎక్కువగా జుట్టు రాలిపోతున్నట్లయితే ఇలాంటి పొడితో వారానికి ఒకసారి చేయండి. ఇక జుట్టు రాలదు. జుట్టు రాలిపోతుందని బాధపడే వాళ్ళు వారానికి ఒక సారి ఇలా చేస్తే చాలు. ఒక్క వెంట్రుక కూడా రాలదు.

Remidies for long hair

Advertisement

Advertisement

స్టవ్ మీద పాన్ పెట్టి రెండు కప్పుల బియ్యం కడిగిన నీళ్లు పోయాలి. తర్వాత ఆ నీళ్లు కొంచెం వేడెక్కిన తర్వాత మూడు టేబుల్ స్పూన్ల వరకు టీ పొడిని వేసుకోండి. ఆ తర్వాత ఒక కప్పు తులసి ఆకులని, ఒక టేబుల్ స్పూన్ ఎండిన ఉసిరిముక్కలని వేసుకోవాలి. 15 నిమిషాల పాటు వీటిని మరిగించుకోవాలి ఆ తర్వాత మీరు ఈ మిశ్రమాన్ని ఫిల్టర్ చేసుకోండి. ఇది పూర్తిగా చల్లారాక ఒక టేబుల్ స్పూన్ ఆముదం, ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె వేసుకోవాలి. దీన్ని మీరు జుట్టు పై నుండి కింద వరకు కూడా బాగా పట్టించాలి. గంట తర్వాత షాంపుతో తలస్నానం చేస్తే సరిపోతుంది. జుట్టు బలంగా మారుతుంది. సిల్కీగా వస్తుంది.

Also read:

Visitors Are Also Reading