బట్టల మీద ఏవైనా మరకలు పడితే అవి వదలవు. పైగా వాటిని మళ్ళీ వేసుకోవడానికి బాగోవు. చాలా మంది చాలా బట్టల్ని ఈ విధంగానే పక్కన పెట్టేస్తూ ఉంటారు. బట్టలు మీద మరక తొలగి పోవాలంటే కొన్ని టిప్స్ ఇక్కడ ఉన్నాయి. ఇలా కనుక మీరు చేసినట్లయితే సులభంగా బట్టలు మీద మరకని పోగొట్టొచ్చు. ఎటువంటి మరకలు అయినా కూడా క్షణాల్లో పోతాయి. బట్టల మీద మరకలు తొలగించడానికి ఒక గిన్నెలో ఒక టీ స్పూన్ బేకింగ్ సోడాని వేయండి.
Advertisement
అందులో అర టీ స్పూన్ నిమ్మరసం వేసుకోండి. దీనిలోనే మీరు లిక్విడ్ సోప్ అలానే వెనిగర్ వేయండి. కొద్దిగా నీళ్లు వేసి దీనిని ఒక లిక్విడ్ లాగ తయారు చేసుకోండి. ఇప్పుడు మీరు ఎక్కడైతే మారక ఉందొ.. ఆ బట్టను తీసి దాని మీద ఒక చెంచా తో ఈ లిక్విడ్ని వేయండి కొన్ని క్షణాల్లోనే మారక పూర్తిగా పోతుంది. తర్వాత ఏదైనా టిష్యూ పేపర్ తో శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత మీరు నీళ్లలో పెట్టి ఉతికేసుకోవచ్చు.
Advertisement
ఇలా ఈజీగా ఎలాంటి మరక అయినా కూడా పోతుంది బట్టలు చాలా తెల్లగా వచ్చేస్తాయి. తళతళా మెరుస్తాయి. పైగా మరకలు పడినప్పుడు చాలామంది బ్రష్ పెట్టి రుద్దుతూ ఉంటారు అలాంటి బాధ కూడా లేదు. తక్కువ ఖర్చుతోనే ఇలా ఈజీగా మీరు బట్టల మీద మరకలు వదిలించుకోవచ్చు. మరి ఇక ఈసారి ఏ చింత లేకుండా ఈజీగా ఇలా మరకల్ని తొలగించేయండి.
Also read:
- మీ పేరు మీద ఎన్ని సిమ్స్ ఉన్నాయో తెలుసుకోవాలా..? ఇలా చేయండి..!
- బ్రహ్మానందం రెండో కోడలు బ్యాగ్రౌండ్ తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
- పాలల్లో వీటిని కలుపుకుని తీసుకుంటే.. మంచి నిద్రని పొందవచ్చు..!