నవరాత్రులలో చాలామంది ఉపవాసం చేస్తూ ఉంటారు. ఉపవాసం చేయడం వలన ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. తొమ్మిది రోజులు ఉపవాసం చేయాలనుకునే వాళ్ళు ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. అయితే ఉపవాసం చేసిన తర్వాత ఎక్కువ ప్రసాదాలు, రుచికరమైన ఆహార పదార్థాలు తీసుకుంటూ ఉంటారు. ఏదైనా ఆహారాన్ని ఎక్కువ మోతాదులో ఒకేసారి తీసుకోవడం వలన ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఉపవాసం ఉన్నప్పుడు పండ్లు, మఖాన, రెడ్ రైస్ ఇలా రకరకాల వంటకాలను మనం తీసుకోవచ్చు. కొంతమంది స్వీట్స్ ఎక్కువగా చేస్తూ ఉంటారు. అయితే షుగర్ ఉన్న వాళ్ళు వాటికి దూరంగా ఉండాలి.
Advertisement
Advertisement
చాలా సేపటి వరకు ఆహారం తీసుకోకుండా ఒక్కసారిగా స్వీట్ తీసుకోవడం వలన ఆరోగ్యం పాడవుతుంది. తియ్యగా ఉండే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. లేదంటే అనవసరంగా బరువు పెరిగిపోవడంతో పాటుగా ఇతర ఇబ్బందులు కూడా కలుగుతాయి. ఉపవాసం ఉండి ఒకేసారి అతిగా తినడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. ఆకలి వేసినప్పుడు పండ్లు తీసుకోవడం, సులభంగా జీర్ణం అయ్యే ఆహారాన్ని తీసుకోవడం మంచిది. ప్రెజర్వేటివ్స్ ఉండే వాటిని తీసుకోవద్దు. ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను తీసుకోకూడదు. ఉపవాసం ఉన్నప్పుడు నీళ్లు ఆరారా తాగడం మంచిదే. డిహైడ్రేషన్ సమస్య కలగకుండా ఉంటుంది. ఉపవాసం సమయం లో సరిగా నిద్రపోలేక పోతే ఎసిడిటీ, గ్యాస్టిక్ వంటి సమస్యలు కలుగుతాయి.
Also read:
- కాఫీ పొడి తో అందం రెట్టింపు.. బ్యూటీ పార్లర్ ఖర్చు కూడా మిగులుతుంది..!
- చాణక్య నీతి: భార్యాభర్తల మధ్యలోకి ఇవి వస్తే.. బంధం పాడవుతుంది..!
- ఎక్కిళ్ళు ఆగకుండా వస్తే.. ఇలా చేయండి… వెంటనే ఆగిపోతాయి..!