దసరా పండుగ వచ్చిందంటే తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని అలంకరించి పూజ చేస్తూ ఉంటాము. ఒక్కో రోజు ఒక్కో అలంకరణ చేసి రోజుకొక నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పిస్తూ ఉంటాము. ఇక త్వరలోనే దసరా సంబరాలు మొదలు కాబోతున్నాయి దసరా పండుగ సందర్భంగా తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులుగా జరుపుతారు. శక్తి ఆరాధనకి ప్రాధాన్యతని ఇచ్చి జరుపుకునే పండుగ ఈ దసరా పండుగ. ఇక ఏ రోజు ఎలా అలంకరించాలి..? వీటిని నైవేద్యంగా పెట్టాలి అనేది తెలుసుకుందాం.
Advertisement
అమ్మవారికి మొదటి రోజు లేత గులాబీ రంగు చీర కట్టి అలంకరిస్తారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి గా పూజలు చేస్తారు. అమ్మవారికి పులిహోరని నైవేద్యంగా పెడతారు. రెండవ రోజు గాయత్రి దేవి అలంకరణ. కాషాయం లేదంటే నారింజ రంగు చీర కట్టి అలంకరిస్తారు. కొబ్బరి అన్నం, కొబ్బరి పాయసం, కొబ్బరి లడ్డూలని పెడతారు. మూడవరోజు అన్నపూర్ణాదేవి. గంధం లేదా పసుపు రంగు చీరని కడతారు. దద్దోజనం, క్షీరన్నాన్ని నైవేద్యంగా పెడతారు.
Advertisement
నాల్గవ రోజు మహాలక్ష్మి దేవి. గులాబీ రంగు చీర కడతారు చక్కెర పొంగలి నైవేద్యంగా పెట్టాలి. ఐదవ రోజు లలితా త్రిపుర సుందరీ దేవి. దద్దోజనం, క్షీరార్ణం పెట్టాలి. ఎరుపు రంగు చీర కాని కుంకుమ రంగు చీర కానీ కడతారు. ఆరవ రోజు సరస్వతి దేవి తెలుపు రంగు చీరలో అలంకరించాలి. కేసరి లేదా పరమాన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి. ఏడవ రోజు దుర్గాదేవి అలంకరణ ఎరుపు రంగు చీర కట్టి కదంబం నైవేద్యంగా పెట్టాలి. ఎనిమిదవ రోజు శ్రీ మహిషాసుర మర్దిని గా అలంకరించాలి. ఎరుపు రంగు చీర కట్టాలి. చక్కెర పొంగలి నైవేద్యంగా పెట్టాలి. 9వ రోజు రాజరాజేశ్వరి దేవి. ఆకుపచ్చ రంగు చీర కట్టి అలంకరించాలి లడ్డూలు, పులిహోర, బూరెలు, గారెలు, అన్నం నైవేద్యంగా పెడతారు.
Also read:
- Dussehra 2023: నవరాత్రుల్లో ఉపవాసం చేసేవాళ్ళు… ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి..!
- కాఫీ పొడి తో అందం రెట్టింపు.. బ్యూటీ పార్లర్ ఖర్చు కూడా మిగులుతుంది..!
- చాణక్య నీతి: భార్యాభర్తల మధ్యలోకి ఇవి వస్తే.. బంధం పాడవుతుంది..!