Home » నాకు బాలీవుడ్ లో అది నచ్చలేదు..!

నాకు బాలీవుడ్ లో అది నచ్చలేదు..!

by Azhar
Ad

బాలీవుడ్ అనేది మన దేశంలోనే అతి పెద్ద సినీ ఇండస్ట్రీ. అందుకు కారణమా కేవలం ఆ భాష మాట్లాడేవారు ఇండియాలో ఎక్కువగా ఉండటమే. కానీ ఈ మధ్య కాలంలో ప్రతి హీరో కూడా తమ సినిమాలను దేశ వ్యాప్తంగా ఎక్కువ మాట్లాడే అన్ని భాషల్లో విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ లో అక్కడి హీరోల కంటే బయట నుండి వచ్చిన హీరోలే ఎక్కువ హిట్స్ అనేవి అందుకుంటున్నారు.

Advertisement

అందులో మలయాళ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ కూడా ఉన్నాడు. ఈ మధ్యే తెలుగులో సీతారామం సినిమాతో హిట్ అందుకున్న దుల్కర్ సల్మాన్.. దానిని హిందీలో కూడా విడుదల చేస్తే అక్కడ హిట్ కొట్టాడు. అలాగే ఇప్పుడు హిందీలో నేరుగా చుప్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లోనే దుల్కర్ సల్మాన్ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసాడు.

Advertisement

దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. నాకు బాలీవుడ్ లో ఉన్న బాయ్ కాట్ కల్చర్ అనేది నచ్చదు అని చెప్పాడు. సౌత్ లో ఇటువంటివి ఉండవు అని అన్నాడు. సినిమాను సినిమాలగే చూడాలి అని చెప్పాడు దుల్కర్. అలాగే కంటెంట్ ఉంటె ఏ సినిమా అయిన హిట్ అవుతుంది అని కూడా అన్నాడు. కానీ ఇలా ఓపెన్ గా నాకు బాయ్ కాట్ కల్చర్ అనేది నచ్చదు అంటూ దుల్కర్ కామెంట్స్ చేయడంతో.. అక్కడి బాయ్ కాట్ వారు దుల్కర్ సినిమాను కూడా టార్గెట్ చేస్తారేమో అనే అనుమానాలు వస్తున్నాయి.

ఇవి కూడా చదవండి :

పురుషుల కంటే ముందు పాకిస్థాన్ తో తలపడనున్న భారత మహిళలు..!

రోహిత్ కోపానికి కారణం ఏంటో తెలుసా..?

Visitors Are Also Reading