Home » శని ప్రభావం వల్ల జనవరి 17 నుంచి ఆ రెండు రాశుల వారికి కష్టాలు తప్పవు..!

శని ప్రభావం వల్ల జనవరి 17 నుంచి ఆ రెండు రాశుల వారికి కష్టాలు తప్పవు..!

by Anji
Ad

2023 నూతన సంవత్సరం మరో 15 రోజుల్లో ప్రారంభం కానుంది. కొత్త ఏడాది ఎలా ఉంటుందనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో ఉంటుంది. నూతన సంవత్సరంలో గ్రహాల స్థితి అనుకూలంగా ఉంటుందా..? ఉండదా..? అనే డైలామాలో పడుతుంటారు. ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉంటాయనేది తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ముఖ్యంగా కొత్త సంవత్సరంలో శని స్థితికి చాలా ప్రాధాన్యతనే ఉంటుంది. కొందరకిీ అనుకూలంగా ఉంటే.. మరికొందరికీ ప్రతికూలంగా ఉంటుంది. 

Advertisement

నూతన సంవత్సరంలో శని పరివర్తనం కారణంగా కొన్ని రాశుల జాతకాలపై కష్టంగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో శని కోపం నుంచి కాపాడుకునేందుకు నష్టం కలుగకుండా ఉండేందుకు కొన్ని విషయాలు తప్పకుండా పరిశీలించాలి. శనని శాంతించడానికి జ్యోతిష్యశాస్త్రంలో చాలా ఉపాయాలున్నాయి. 2023లో ఏ రాశి వారు అప్రమత్తంగా ఉండాలి..? శని ప్రకోపం నుంచి కాపాడుకునేందుకు ఏం చేయాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. శని మకర రాశి నుంచి బయటికి వచ్చి కుంభరాశిలోకి 2023 జనవరి 17న ప్రవేశించనున్నాడు. గ్రహాలన్నింటిలోకెల్లా శని గ్రహమే అత్యంత నెమ్మదిగా కదిలే గ్రహం. ఈ తరుణంలో జనవరి 17, 2023న కుంభరాశి గోచారం తరువాత 2024లో శని ఏ రాశిలోకి మారదు.   ఇక ఆ తరువాత 2025లో అంటే మార్చి 29న శని మీన రాశిలో ప్రవేశించనున్నాడు. ఈ నేపథ్యంలో మకరం, కుంభ రాశుల వారి జీవితంలో కష్టాలు పెరగనున్నాయి. వీరు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతరులను నిందించకుండా ఉండడం మంచిది. శని చాలిసా పఠించడం వల్ల మాత్రమే ప్రయోజనాలు కలుగుతాయి. 

Also Read :   2023లో మూడు రాశుల వారికి అదృష్టం మామూలుగా ఉండదు..!

Visitors Are Also Reading