Home » మనిషిని భయపెట్టే ఐదు రకాల కలలు…వాటి అర్థాలు…!

మనిషిని భయపెట్టే ఐదు రకాల కలలు…వాటి అర్థాలు…!

by AJAY
Ad

ప్రతి మనిషికి నిద్రలో కలలు రావడం సహజం. అయితే కొందరికి ఎక్కువ కలలు వస్తే మరికొందరికి తక్కువగా వస్తుంటాయి. అంతేకాకుండా మనిషికి వచ్చే కలలో కొన్ని భయపెట్టే విధంగా ఉండగా మరికొన్ని సంతోషాన్నిచ్చేవి కూడా ఉంటాయి. ఇక ఈ కలల గురించి మానసిక శాస్త్రవేత్తలు, విశ్లేషకులు.. ఆధునిక సిద్ధాంతకర్తలు ఒక్కోవిధంగా చెబుతున్నారు. వారిలో విశ్లేషకులు మాత్రం కలలు 5రకాలని…వాటి అర్థాలను కూడా చెప్పారు.

 

వెంట పడుతున్నట్టు కల రావడం

Advertisement

 

డ్రీమ్ ఇంటర్ ప్రీటర్స్ ప్రకారం ప్రధానంగా కలలో ఎవరైనా మీ వెంట పడుతున్నట్టు అనిపిస్తే ఏదో ఒక విషయంలో మీరు తప్పించుకు తిరుగుతున్నారని అర్థమట. మీలో ఉన్న భయం కోరికకు అది ప్రతిరూపమని చెబుతున్నారు. అంతేకాకుండా కలలో మీ వెంట పడుతుంది జంతువులు అయితే మీ ఎమోషన్స్ అంటే కోపం, తాపం, ఫ్యాషన్ ఇలాంటి వాటిని మీరు దాచి పెడుతున్నారు అని అర్థం. ఒకవేళ మీరు అబ్బాయి అయి ఉండి మిమ్మల్ని అమ్మాయి వెంబడిస్తే లేదంటే మీరు అమ్మాయిలు అయి ఉండి మిమ్మల్ని అబ్బాయిలు చేజ్ చేస్తే మీరు గతంలో ప్రేమలో జరిగిన అనుభవాలను గుర్తు తెచ్చుకొని భయపడుతున్నట్లు అర్థమట.

 

దుస్తులు లేకుండా బిలబడినట్టు కలలు రావడం

పబ్లిక్ ప్లేస్ లో దుస్తులు లేకుండా ఉండటం ఇలాంటి కలలు వస్తే మీ లోపాలు అంతరంగం గురించి ప్రజలు తెలుసుకుంటారు అని భయపడుతున్నారు అని అర్థమట

Advertisement

 

ఎత్తు నుండి పడినట్టు కలలు రావడం

 

చాలా ఎత్తు నుండి కింద పడిపోయినట్టు కలలు వస్తే…

మీరు ఏదైనా పనిని ఇష్టంగా చేయాలి అనుకుంటారు. కానీ ఆ పనిని భయంతో చేయలేకపోతారు. అలాంటి సందర్భాల్లో ఇలాంటి కలలు వస్తాయట. ఒకవేళ మీకు ఇలాంటి కలలు వచ్చినట్లయితే ప్రశాంతంగా కూర్చుని మీకు కావాల్సింది ఏమిటి దాన్ని ఎలా సాధించుకోవాలి అని నిర్ణయించుకోవాలి.

 

 

మరణం కలలు

సాధారణంగా ఎక్కువ మందికి తమకు దగ్గరి వారు కుటుంబ సభ్యులు లేదా చుట్టుపక్కల వారు మరణించినట్టు కలలు వస్తుంటాయి. అయితే దానికి ఏదో ఒక మార్పు జరగనుండగా దానికి భయపడుతున్నట్లు వ్యాకులతతో ఉన్నట్టు అర్థమట. మీకు చాలా దగ్గరి వ్యక్తులు మరణించినట్టు కలలో వస్తే భవిష్యత్తు విషయంలో ఎంతో టెన్షన్ పడుతున్నట్లు అర్థమట అంతేకాకుండా గతాన్ని తల్చుకుని బాధపడుతున్నట్టు అర్థమట.

 

 

పళ్ళు ఊడటం

 

పళ్ళు ఊడుతున్నట్టుగా కలలు వస్తే మీరు లక్ విషయంలో బాధపడుతున్నట్టు అర్థమట. అంతేకాకుండా మీ వద్ద ఉన్నది ఏదో ఈ ప్రపంచం ముందు ఉంచడానికి… భయపడి దాచుకోవడానికి ప్రయత్నిస్తున్నారని అర్థం వస్తుందట.

Visitors Are Also Reading