దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసింది. ఎన్టీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము గెలుపొందారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా బరిలోకి దిగిన ముర్ము విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై ఘన విజయం సాధించారు. దేశంలో అత్యున్నత పీఠాన్ని దక్కించుకున్న తొలి ఆదివాసి మహిళగా చరిత్ర సృష్టించారు. దేశానికి రెండవ మహిళా రాష్ట్రపతిగా ఘనత సాధించారు. జులై 25న రాష్ట్రపతిగా ప్రమాణం చేయనున్నారు. మూడవ రౌండ్ ఫలితాలతోనే మెజార్టీని సాధించారు.
ఇక మూడో రౌండ్ ఎన్నికల ఫలితాల ప్రకారం.. ద్రౌపది ముర్ము 50 శాతం మార్కును దాటారు. ద్రౌపది ముర్ముకు 2161 ఓట్లు పోలవ్వగా.. యశ్వంత్ సిన్హాకు 1,058 ఓట్లు పోలయ్యాయి. ద్రౌపది ముర్ముకు పోలైన మొత్తం ఓట్ల విలువ 5,77,777 కాగా.. యశ్వంత్ సిన్హాకు పోలైన మొత్తం ఓట్ల విలువ 2,61,062. ఓట్ల లెక్కింపులో తొలిరౌండ్ నుంచే ద్రౌపది ముర్ము స్పష్టమైన ఆదిక్యం కనబరిచారు. చివరికీ 68 శాతం కంటే ఎక్కువ ఓట్లతో ఘన విజయం సాధించారు. ఇక మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, జార్కాండ్, రాష్ట్రాల్లో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగినట్టు తెలుస్తోంది. ఎంపీలలో 17 మంది క్రాస్ ఓటింగ్ జరిగినట్టు సమాచారం.
Advertisement
Advertisement
రాష్ట్రపతి ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన ద్రౌపది ముర్ముఉ ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. ద్రౌపది ముర్ము గెలుపుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. ద్రౌపది ముర్ముకు అభినందనలు తెలుపుతూ పలువురు నేతలు ట్వీట్లు చేసారు. ఇక ఆమెకు అభినందనలు తెలిపిన వారిలో విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా కూడా ఉన్నారు.
Also Read :
విజయ్ దేవరకొండ లైగర్ ట్రైలర్ లో ఈ 5 మైనస్ పాయింట్స్ మీరు గమనించారా..?