కొన్ని పనులు చేయడం మంచిది కాదని పెద్దలు చెబుతుంటారు. కడప మీద కూర్చోవద్దని, బెడ్ పై కూర్చుని అన్నం తినవద్దని ఇలా చాలా చెబుతుంటారు. అలా చేయవద్దని చెప్పడం వెనక కూడా కారణాలు ఉంటాయి. అదే విధంగా సాధారణంగా మన ఇళ్లలో ఏ వస్తువు తుడవడానికి అయినా పాత దుస్తులను వాడుతుంటాం. అదే విధంగా ఫ్లోర్ తుడవడానికి, కార్ తుడవడానికి, వంటిట్లో వేడి గిన్నెలను పట్టుకోవడానికి చెప్పుకుంటూ పోతే ఇలా చాలా పనులకు మన పాత దుస్తులను వాడుతుంటాం.
Advertisement
కానీ అలా చేయకూడదని చెబుతుంటారు. అలా చెప్పడం వెనక కూడా ఓ కారణం ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం….మన శరీరానికి దుస్తులకు ఎంతో దగ్గరి బంధం ఉంటుంది. దుస్తులు మనకు చాలా దగ్గరగా ఉంటాయి. వాటితో మనకు ఎంతో కనెక్షన్ ఉంటుంది. మనం వేసుకున్న దుస్తులను ఎన్నిసార్లు ఉతికినా వాటిలోని పర్ఫ్యూమ్ వాసన అలానే ఉంటుంది.
Advertisement
అయితే అలా మనకు దగ్గరి అనుబంధం ఉండే దుస్తులను ఫ్లోర్ తుడవడానికి, కార్ లు తుడవడానికి వాడటం వల్ల ఆ దుస్తులు వేసుకునేవాళ్లు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందని పెద్దలు చెబుతుంటారు. వాళ్లు ఏదైనా పని అనుకున్నా అది జరగదట. అయితే పాత దుస్తులను ఇంట్లో కొన్ని మంచి పనులకు ఉపయోగించవచ్చట.
ఇంట్లో బొంతలు కుట్టుకునేందుకు అలాగా దిండు తయారీకి ఉపయోగించుకోవచ్చట. అంతకంటే వేరే వాళ్లకు ఇవ్వడం…పేదలకు, అనాథలకు ఇవ్వడం కూడా మంచిదని చెబుతున్నారు. అయితే అలా దుస్తులను ఇచ్చేముందు ఖచ్చితంగా వేడినీటిలో ఉప్పువేసి పిండేసి ఇవ్వాలని చెబుతున్నారు. అలా చేయడం ద్వారా మనకు ఏవైనా చర్మ వ్యాదులు ఉన్నా కూడా దుస్తులు తీసుకునేవారికి సోకకుండా ఉంటాయని చెబుతున్నారు.
also read:
బ్లెడ్ మధ్యలో ఒక్కే డిజైన్ ఎందుకు ఉంటుందో మీకు తెలుసా..?
మీ సంసార జీవితం సుఖంగా సాగాలంటే… భార్య భర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలంటే..?