ఆరోగ్యమే మహా భాగ్యం అని పెద్దలు ఎప్పుడో చెప్పారు. ఆ ఆరోగ్యానికి మూలకాలన్నీ మన వంటింట్లోనే దొరుకుతాయి. మనం ఎక్కడెక్కడో వెతికి ఏవేవో చేస్తూ ఉంటాం. కానీ, మన వంటగదిలో దొరికే వాటితో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటె.. మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. సాధారణంగా ద్రవ పదార్ధాలు శరీరానికి మేలు చేస్తాయి. అందులోను ముఖ్యంగా నీరు. ఇక శనగలు నానబెట్టిన నీరు కూడా శరీరానికి చాలా మేలు చేస్తుంది. ఈ నీటిని క్రమం తప్పకుండ తీసుకోవడం వలన కలిగే ఫలితాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
Advertisement
నిజానికి శనగలు అయినా, బియ్యం అయినా కడిగిన నీటిని ఎప్పటికప్పుడు పారబోసేస్తూ ఉంటాం. కానీ, ఈ నీరే శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రతి రోజూ శనగలు కడిగిన నీటిని తాగడం వలన బ్లడ్ షుగర్ కంట్రోల్ అవుతుంది. మధుమేహం వున్నా వారికీ ఇది నిజంగా వరంలా పని చేస్తుంది. షుగర్ తో పాటు కొలెస్ట్రాల్ ఇబ్బందులు ఉన్నా కూడా ఈ నీరు తాగడం మంచిది. ఈ నీటిని తాగడం వలన జీర్ణ వ్యవస్థ సక్రమంగా పని చేస్తుంది.
Advertisement
అలాగే రక్తం తక్కువగా ఉన్న వారు ఈ నీటిని తాగడం వలన వారిలో రక్తహీనత సమస్య తగ్గుతుంది. ప్రతి రోజు ఈ నీటిని తాగడం వలన ఊబకాయం సమస్య ఉన్న వారు బరువుని తగ్గుతారు. శనగలలో ఉండే ప్రోటీన్లు పీచు పదార్ధాలు, పొటాషియం, విటమిన్లు నీటిలో కలిసిపోతాయి. ఈ నానబెట్టిన నీటిని తాగితే.. ఈ పోషకాలన్నీ మీ శరీరానికి అందుతాయి.
మరిన్ని ముఖ్య వార్తలు:
Sanju Samson : బాబు కెరీర్ క్లోజ్.. ఇక ఐపీఎల్ ఆడుకో !
Virat Kohli: విరాట్ కోహ్లీ కొత్త ఇల్లు.. ఏకంగా 8 ఎకరాల్లో
హీరోయిన్ శోభన పెళ్లికి దూరమవ్వడానికి ఆ స్టార్ హీరోనే కారణమయా…!