ఆచార్య చాణక్యుడు జీవితంలో ఎలా ఉంటే కష్టాలు రాకుండా ఉంటాయి…. ఏ సమయంలో ఎలా నడుచుకుంటే కష్టాలని అధిగమించవచ్చు అంటూ ఎన్నో నీతి సూత్రాలను బోధించారు.
అలానే పెళ్లి తరవాత కూడా ఎదురయ్యే ఇబ్బందులను వాటిని అధిగమించాలంటే పాటించాల్సిన సూత్రాలను పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే భార్యలతో ఈ క్రింది నాలుగు విషయలాను అస్సలు షేర్ చేయకూడదు అని చాణక్యుడు తెలిపారు.
బలహీనత :
భర్త తనకు ఉన్న బలహీనతలను భార్యలకు చెప్పకూడదు అని చాణక్యుడు చెప్పాడు. భార్యకు భర్త బలహీనతలు తెలిస్తే ఆ తరవాత అదే అంశాన్ని పదే పదే గుర్తు చేస్తూ అడ్డుకుంటుందని తెలిపాడు.
సాయం చేస్తే తెలియకూడదు :
ఎవరికైనా సహాయం చేయాలనుకుంటే గుట్టు చప్పుడు కాకుండా చేయాలని కానీ ఆ విషయాన్ని భార్యతో షేర్ చేయవద్దని చాణక్యుడు తెలిపాడు.
భర్త ఆదాయం :
భర్త తన ఆదాయాన్ని కూడా భార్యతో చెప్పకూడదు అని ఆచార్య చాణక్యుడు తెలిపాడు. భర్త తన ఆదాయాన్ని చెబితే భార్య ఖర్చులు ఎక్కువ చేస్తుందని….దాంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని చాణక్యుడు వెల్లడించారు.
గతంలో జరిగిన అవమానాలు :
భర్తలకు గతంలో ఏవైనా అవమానాలు కలిగితే వాటిని భార్య లతో అస్సలు షేర్ చేసుకోకూడదు అని ఆచార్య చాణక్యుడు వెల్లడించారు. అలా భర్తకు జరిగిన అవమానాలు చెప్పడం వల్ల ఆమెకు చులకన భావం ఏర్పడే అవకాశం ఉందని చాణక్యుడు పేర్కొన్నాడు.
Also read : సోమవారం ఈ పనులు అస్సలు చేయకండి..లేదంటే శివుడి ఆగ్రహం తప్పదు..!