చాలా మంది తమకు సంబంధించిన ప్రతి విషయాన్ని అవతలి వ్యక్తులతో పంచుకునేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఇది వారి వరకు మంచిదే కావొచ్చు. చెప్పుకుంటే ఏ విషయాలైనా తేలికౌతాయి. అలాగని మనలోని బలహీనతలను, బలాలను, మన ఇష్టాలను, కష్టాలను గురించి అవతలి వ్యక్తులకు చెప్పుకుంటే దానివలస అనేక ఇబ్బందులు తలెత్తుతాయి అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు.
మనలో మనకు ఏవైనా టార్గెట్ పెట్టుకుంటే, ఆ టార్గెట్‌ను రీచ్ అయ్యాక మాత్రమే మిగతా వారితో పంచుకోవాలి. ముందుగానే టాం టాం వేస్తే… ఒకవేళ మీరు ఆ టార్గెట్‌ను రీచ్ కాలేకుంటే దాని వలన మీరు నలుగురిలో చులకనయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీ ఆర్థిక విషయాలు కూడా పదిమందితో ఎప్పుడూ పంచుకోవద్దు. ఆర్ధికంగా ఇబ్బందులు వస్తే వారు మీపై ఆధారపడే అవకాశం రావొచ్చు. అలానే, మీరు ఎవరికైనా సహాయం చేయాలి అనుకుంటే కుడిచేస్తేనే సహాయం చేయండి. భార్యభర్తల మధ్య జరిగే విషయాలను స్నేహితులకు చెబుతుంటారు. అలా చేయడం చాలా తప్పు. మీపట్ల మీ స్నేహితుల్లో చులకనభావం ఏర్పడే అవకాశం ఉంటుంది.
Advertisement