ప్రపంచంలో కఠినమైన చట్టాలు అమలు చేసే దేశాల్లో ముందుగా చెప్పుకునే దేశం పేరు సౌదీ అరేబియా. ఈ దేశంలో చిన్నచిన్న తప్పులకు సైతం కఠినమైన చట్టాలు ఉంటాయి. అంతేకాకుండా మహిళలకు కూడా మిగతా దేశాలతో పోలిస్తే స్వేచ్ఛ తక్కువగానే ఉంటుంది. ఇటీవలే ఈ దేశంలోని మహిళలకు వాహనాలు నడిపే హక్కులు…స్టేడియం కు వెళ్లి క్రికెట్ మ్యాచ్ లు చూసే హక్కులు లభించాయి.
Advertisement
అలాంటి కఠినమైన ఆంక్షలు విధించే దేశంలో ఇప్పుడు మరో దారుణమైన చట్టాన్ని తీసుకువచ్చారు. సాధారణంగా స్నేహితులు మరియు ప్రేమికులు వాట్సప్ లో ఉండే లవ్ హార్ట్ ఎమోజీలను పంపుకుంటారన్న సంగతి తెలిసిందే. అయితే అనుమతి లేకుండా లవ్ ఎమోజీలు పంపితే రూ.20లక్షల ఫైన్ వేస్తామని సౌదీ అరేబియా ప్రకటించింది. అంతే కాకుండా లవ్ ఎమోజీలు అనుమతి లేకుండా పంపడం నేరంగా పరిగనిస్తామని చెప్పింది. ఇదే నేరాన్ని కొనసాగిస్తే 3లక్షల రియాల్స్ ఫైన్ కట్టడంతో పాటూ ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తామని కూడా హెచ్చరించింది.
Advertisement
ఇక సౌదీ చేసిన తాజా ప్రకటనతో యువత ఆందోళన చెందుతున్నారు. ఈ వార్త చదివిన వాళ్లు కూడా షాక్ అవుతున్నారు. ఇవెక్కడి చట్టాలు రా బాబు అనుకుంటున్నారు. ఇక మనదేశంలో విచ్చలవిడిగా ఈ ఎమోజీలను వాడుతున్న సంగతి తెలిసిందే. అమ్మాయిలు అబ్బాలు కూడా ఫ్రెండ్ అంటూ లవ్ ఎమోజీలను పంపుకోవడమే ఇప్పుడు మనదగ్గర ట్రెండ్ కూడా. అయితే అలాంటి కల్చర్ నచ్చని వాళ్ల మాత్రం మన దగ్గర కూడా ఇలాంటి రూల్స్ తెస్తే బాగుండని అనుకుంటున్నారు.