ఒకప్పుడు పెళ్లి చేసుకోవాలంటే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడాలని చెప్పేవారు. కానీ ఇప్పుడు అలా చేయడం లేదు. ఒక్క తరం బాగుంటే చాలు పెళ్లి చేసుకోవడానికి అనుకుంటున్నారు. అంతే కాకుండా ఒకప్పుడు మేనరికంలోనే పెళ్లిళ్లు ఎక్కువగా జరిగేవి. హిందువుల్లో అయితే మేనబావ లేదంటే మేన మామలను వివాహం చేసుకునేవారు. అలా దగ్గరి సంబంధం ఉన్నవాళ్లు పెళ్లి చేసుకోవడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి.
ALSO READ : ఇండియాలో ఫేస్బుక్, ఇన్ స్టా బ్లూటిక్ కు చార్జీలు… నెలకు ఎంత అంటే?
Advertisement
తమ ఆస్థి తమ కుటుంబంలోని వారికే చెందాలని..అంతే కాకుండా దగ్గరివారి లక్షణాలు గుణం ముందే తెలుస్తాయి కాబట్టి సమస్యలు తక్కువగా వస్తాయని నమ్మేవారు. అయితే ప్రస్తుతం ఏకంగా రాష్ట్రాలు దాటి మరీ సంబంధాలు కుదుర్చుకుంటున్నారు. కులమతాలు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. అయితే దూరం వారిని పెళ్లి చేసుకున్నప్పుడు వారి లక్షణాలు తెలిసే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
Advertisement
కాబట్టి కొన్ని లక్షణాలను బట్టి తమ జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవాలని మానసిక నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం…పెళ్లికి ముందు అబ్బాయికి ఏమైనా చెడు అలవాట్లు ఉన్నాయా అని ఖచ్చితంగా తెలుసుకోవాలని మానసిక నిపుణులు చెబుతున్నారు. చెడు అలవాట్ల గొడవలు జరిగే ప్రమాదం ఉందని చెబుతన్నారు.
అదే విధంగా చేసుకోబోయే అబ్బాయికి అయినా అమ్మాయి గతంలో ఎవరినైనా ప్రేమించారా ప్రస్తుతం ఏమైనా లవ్ ఎఫై* లు ఉన్నాయా అని కూడా తెలుసుకోవాలని చెబుతున్నారు. వీటితో పాటూ తమకు కాబోయేవారు డబ్బులు ఎక్కువగా ఖర్చుపెడతారా..? ఎక్కువగా కోప్పడతారా లాంటి లక్షణాలు కూడా ఉన్నాయో లేదో తెలుసుకుంటే మంచిదని సూచిస్తున్నారు.
ALSO READ :ఇండియాలో ఫేస్బుక్, ఇన్ స్టా బ్లూటిక్ కు చార్జీలు… నెలకు ఎంత అంటే?