సమ్మర్ లో ఎక్కువగా చెమటలు పట్టడం సాధారణం. ఎక్కడికీ వెళ్లకుండా ఇంటిపట్టునే ఉన్నా.. ఉక్కపోత, వేడి గాలుల కారణంగా చెమటలు పట్టడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. సమ్మర్ ను పక్కన పెడితే, మిగతా సీజన్లలో అంత ఉక్కపోత ఉండదు. సమ్మర్ లో మాత్రం ఎక్కువగా చమటలు పట్టేస్తూ ఉంటాయి. కానీ, కొందరికి మాత్రం సీజన్ తో సంబంధం లేకుండా చమటలు పడుతూ ఉంటాయి.
Advertisement
తరచుగా చమటలు పట్టడం, చిన్న పని చేసినా ఒళ్ళంతా చెమటతో తడిసిపోవడం వంటివి జరుగుతుంటాయి. అటువంటి వ్యక్తులు కొన్ని రకాల ఆహార పదార్ధాలకు దూరంగా ఉండాలి. చమట సమస్యల నుంచి ఉపశమనం పొందేవరకు కొన్ని రకాల ఆహారపదార్ధాలు, పానీయాలకు దూరంగా ఉండాలి. అవేంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. వీరు కాఫీ ఎక్కువగా తాగడం తగ్గించాలి. కాఫీలో కెఫీన్ ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు.
Advertisement
వీరు ఎక్కువ మోతాదులో సాల్టీ ఫుడ్స్ తీసుకోకూడదు. దానివల్ల శరీరం బ్రేక్ డౌన్ మెకానిజానికి లోనై ఎక్కువగా వచ్చిన సోడియం ను చమట రూపంలో బయటకు పంపిస్తుంది. అలాగే ఆల్కహాల్ తాగడం తగ్గించాలి. ఆల్కహాల్ రక్తంలో చేరి హృదయ స్పందన రేటుని పెంచుతుంది. ఫలితంగా రక్తనాళాలు విశాలంగా మరి చమట గ్రంథులను ఓపెన్ చేస్తాయి. ఫలితంగా ఎక్కువ చమట పడుతుంది. అలాగే, సల్ఫర్ అధికంగా ఉండే ఆహరం, స్పైసి గా ఉండే ఫుడ్స్ ను కూడా వీరు తగ్గించాలి.
మరిన్ని ముఖ్య వార్తలు:
30 ఏళ్ల తర్వాత మహిళలకు వచ్చే ఆరోగ్య సమస్యలు..!!
30 ఏళ్ల వయసు దాటిన మహిళలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసా?