వారాన్ని బట్టి కొన్ని పనులను చేస్తే… మరి కొన్ని పనులను అసలు చేయకూడదు. ముఖ్యంగా సోమవారం ఏ పని పడితే ఆ పని అస్సలు చేయకూడదు. సోమవారం పరమేశ్వరుడికి ప్రత్యేకమైన రోజు… కాబట్టి ఈ రోజున శివ భక్తులు చాలామంది ఉపవాసం ఉంటారు. శివుడికి పూజలు చేస్తారు…. కానీ కొంతమంది మాత్రం సోమవారం చేయకూడని పనులు చేస్తారు. అయితే అలా ఏ పని పడితే ఆ పని చేస్తే వినాశనమే అని పండితులు హెచ్చరిస్తున్నారు.
Advertisement
సోమవారం నాడు ఇంట్లోకి పాము వస్తే దాని అసలు చంపకూడదని పండితులు చెబుతున్నారు. సోమవారం పాము ని చంపితే భారీ ఎత్తున ప్రతికూల ఎనర్జీ ఇంట్లో చేరుతుందని దాంతో అన్నీ నష్టాలు జరుగుతాయని పండితులు చెబుతున్నారు. సోమవారం కొంతమందికి వీక్ ఆఫ్ దొరుకుతుంది. దాంతో ఆ రోజు హెయిర్ కట్, షేవింగ్ లాంటివి చేస్తూ ఉంటారు. కానీ సోమవారం సౌరం చేసుకోకూడదని పండితులు చెబుతున్నారు. అంతేకాకుండా సోమవారం ఉపవాసం ఉంటే చాలా మంచిదని అయితే ఉపవాసం పూర్తవకుండానే మధ్యలో మానేసి భోజనం చేయకూడదని పండితులు చెబుతున్నారు.
Advertisement
ఏమైనా మంచి కార్యక్రమాలు ఉంటే సోమవారం ప్రారంభిస్తే అనుకున్నవి ఫలిస్తాయని చెబుతున్నారు. కొంతమంది శివభక్తులు ఉపవాసం లేకున్నా సోమవారం నాన్ వెజ్ తింటూ ఉంటారు. అయితే ఉపవాసం ఉన్నా లేకున్నా సోమవారంనాడు శివభక్తులు మాంసం తినకూడదని ఆరోజు శాఖాహారం మాత్రమే తీసుకోవాలని పండితులు చెబుతున్నారు.