తల్లితండ్రులకు పిల్లలే ప్రాణం. ఎంతో కష్టపడి పిల్లలను చదివిస్తుంటారు. ఇక చిన్నప్పటి నుండి కొంతమంది తల్లితండ్రులు తమ పిల్లలు ఏం చేసినా మురిసిపోతుంటారు. పొగడ్తలతో ముంచెత్తుతూ ఉంటారు. వాళ్లు చిన్న పనిచేసినా వావ్ అంటూ ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చి ముద్దులు పెట్టేస్తారు. ఇక మాడ్రన్ మమ్మీస్ అయితే పిల్లలు తిట్టినా కొట్టినా మురిసిపోతూ అందరికీ చెప్పుకుని మురిసిపోతుంటారు.
Advertisement
అయితే పిల్లలు మంచిపనులు చేసినప్పుడు పొగడకపోవడం వల్ల ఎలాంటి నష్టం జరుగుతుందో. పిల్లలను అతిగా పొగడటం వల్ల కూడా అంతకంటే ఎక్కువ నష్టం జరుగుతుంది. చిన్న చిన్న పనులకే పిల్లలను అతిగా పొగడటం వల్ల పిల్లలు ప్రతికూల పరిస్థితుల వైపు వెళ్లే అవకాశం ఉంది. పిల్లల పై అనవసరంగా పొగడ్తల వర్షం కురిపిస్తూ ఉంటే వారి ఎదుగుదలకు అడ్డుకట్ట వేసినట్టే అవుతుంది.
Advertisement
Also Read: ఇంటి వద్దే బూస్టర్ డోస్ కావాలా..? అయితే ఈ నెంబర్ కు కాల్ చేయండి..!
అతి పొగడ్తలు పిల్లలను భవిష్యత్ లో వేధింపులకు గురయ్యేలా చేసే అవకాశంతో పాటూ ప్రాణాంతకం కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయట. ఈ విషయాలు బ్రిటన్ ఎక్సెటర్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఎక్సెటర్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో అతి పొగడ్తలు పిల్లల పై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉందని నిర్ధారణ అయ్యింది. అంతే కాకుండా పిల్లలకు పొగడ్తలు బూస్టర్ డోసుల్లాగా పనిచేస్తాయని కానీ సమయం సంధర్బం బట్టి పొగడాలని ఈ పరిశోధనలో వెల్లడైంది.
Also Read: ఇండియన్ ఆర్మీకి విరాళం ఇవ్వడం వాస్తవం కాదు.. సుమన్ క్లారిటీ..!