భార్యభర్తలు ఒకరినొకరు ప్రేమించుకోవాలని చెబుతారు. ప్రేమించుకోవడం వల్ల లాభమే తప్ప నష్టమేమి లేదని కానీ అతిగా ప్రేమించడం అతిగా నమ్మకం పెంచుకోవడం వల్ల కూడా సమస్యలు వచ్చే అవకావాలు ఉన్నాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. భార్యను అయినా భర్తను అయినా అతిగా ప్రేమిస్తే వారిపై ఎక్ప్టేషన్స్ కూడా పెరుగుతాయట.
Advertisement
అలా అంచనాలను పెంచుకున్నప్పుడు వారు ఆశించినట్టుగా భార్యలు కానీ భర్తలు కానీ లేకపోతే అలాంటి సమయంలో చాలా బాధపడతారట. భార్తను అతిగా ప్రేమించే భార్య తన భర్త పుట్టినరోజుకు కచ్చితంగా ఏదో ఒక సర్పైజ్ ఇస్తాడని ఆశపడుతుందట. కానీ భర్త అలా చేయకపోతే ఆమె బాధపడాల్సి వస్తుందట. కొన్ని సార్లు ఇలానే జరిగితే ప్రేమ పోయి భర్తపై ద్వేశం మొదలవుతుందట.
Advertisement
అంతే కాకుండా మనుషులు ఎప్పుడూ ఒకేలా ఉండరని మారుతూ ఉంటారని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ అతిగా ప్రేమించినప్పుడు వాళ్లు గనక ఇతరుల వ్యామోహంలో పడి పట్టించుకోనట్టయితే మానసికంగా కృంగి పోయి తమను తామే హింసించుకుంటారట. ప్రేమ ఎక్కువైనప్పుడు కేరింగ్ కూడా ఎక్కువ అవుతుంది.
కేరింగ్ ఎక్కువ అయితే ఏ పనిచేసేటప్పుడైనా జాగ్రత్తగా ఉండాలంటూ సూచిస్తారట. అలా ఎక్కువ కేరింగ్ కూడా కొన్ని సార్లు జీవిత భాగస్వామికి విసుగు తెప్పిస్తుందట. అలా భర్త ఎక్కువగా ప్రేమిస్తున్నాడని కూడా బాధపడే భార్యలు ఉన్నారని మానసిక నిపుణులు చెబుతున్నారు. కాబట్టి జీవిత భాగస్వామిని ప్రేమించాలని కానీ అతిగా ప్రేమించకూడదని మానసిక నిపుణులు చెబుతున్నారు.