జీవితంలోని ముఖ్యమైన కార్యాలలో పెళ్లి కూడా ఒకటి. జీవితంలో ఒకేసారి పెళ్లి జరుగుతుంది. అయితే పెళ్లికి ముందు కొన్ని పనులు అస్సలు చేయకూడదని మనపెద్దవాళ్లు చెబుతుంటారు. కానీ చాలా మంది ఆ విషయాలను పట్టించుకోరు. అయితే పెద్దవాళ్లు చెప్పే చాలా విషయాల వెనకాల చాలా మ్యాటర్ ఉంటుంది. అలాగే పెళ్లికి ముందు కొన్ని విషయాలు ఎందుకు చేయకూడదు అని చెప్పడం వెనక కూడా కొన్ని నిజాలు ఉన్నాయి….అవి ఏంటన్నది ఇప్పుడు తెలుసుకుందాం….
Advertisement
పెళ్లికి ముందు మద్యం సేవించకూడదని పెద్దలు చెబుతారు. దానికి కారణం మద్యం సేవించడం వల్ల చెమటలు పడతాయి. దాంతో పెళ్లిలో అంతా చికాకుగా ఉంటుంది. కాబట్టి పెళ్లికి ముందు ఆరు రోజుల వరకూ కూడా మద్యం తీసుకోకూడదని చెబుతుంటారు. మద్యం వల్ల డీహైడ్రేషన్ రావొచ్చని కూడా అలా చెబుతుంటారు. పెళ్లికి ముందు మేకప్ లు వేసుకోకపోవడమే మంచిది.
Advertisement
మేకప్ వేసుకుంటే అది ఒంటికి పడితే మంచిదే కానీ కొందరికి ఎలర్జీలు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అంతే కాకుండా కొంతమంది వ్యాయామ ప్రియులు ఉంటారు. రెగ్యులర్ గా వ్యాయామాలు చేస్తుంటారు. అయితే పెళ్లికి ముందు మాత్రం కొత్తగా వ్యాయామాలు ట్రై చేయవద్దు.
అలా కొత్తగా వ్యాయామాలు చేయడం వల్ల ఒంటినొప్పులు వస్తే అదో సమస్యగా మారే అవకాశం ఉంది. కాబట్టి కొత్త వ్యాయామాల జోలికి వెల్లకపోవడమే మంచిది. అంతే కాకుండా కొంతమంది పెళ్లి మోజులో పడి నిద్రను పట్టించుకోరు. అలా చేస్తే శరీరం పూర్తిగా అలసిపోయే ప్రమాదం ఉంది. దాంతో పెళ్లిలో కళ్లు తిరిగిపడిపోయినా పడిపోతారు. కాబట్టి నిద్రను మిస్ చేయకూడదు.
ALSO READ : ఉదయం నిద్ర లేవడానికి, రాత్రి నిద్రించడానికి బెస్ట్ సమయం ఏదో తెలుసా ?