ఇంట్లో సుఖ శాంతులు, సంతోషం కొలువై ఉండాలి అంటే కొన్ని వాస్తు సలహాలను పాటించడంలో తప్పేమి లేదు. శాస్త్రం లో ఏమి చెప్పబడినది, అందులో ఎంతో కొంత సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. కొన్నిసార్లు సాయం సమయంలో చేయకూడని పనులు చేయడం వలన తీరని నష్టం కలుగుతుంది. దాని వలన ఇంటి ఆర్ధిక పరిస్థితులపై ప్రభావం పడే అవకాశం ఉంది.
Advertisement
సూర్యాస్తమయం తరువాత ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వకండి. అలాగే, ఎవరి వద్ద అప్పు తీసుకోకండి. సాయం సమయం దాటిన తరువాత డబ్బు లావాదేవీలు చేయకుండా ఉండడమే మంచిది. సూర్యాస్తమయం దాటాక డబ్బు ఇస్తే ఆ డబ్బు తిరిగిరాదని అంటుంటారు. అలాగే సాయంత్రం అయ్యాక ఇల్లు ఊడ్చకండి. అలా చేస్తే లక్ష్మి దేవి కి ఆగ్రహం వచ్చి.. ఆర్ధిక స్థితి గతులపై ప్రభావం పడుతుంది.
Advertisement
ఒకవేళ ఊడవాల్సి వచ్చినా, ఆ కసువుని బయట పడేయకుండా ఒక పక్కాగా ఉంచి మరుసటి రోజున పడవేయాలి. అలాగే సాయంత్రం అయ్యాక తులసి మొక్క ఆకులు కొస్తే విష్ణుమూర్తికి కోపం వస్తుంది. అందుకే అటువంటి పనులను చేయవద్దు. సాయం సమయంలో తులసిని తాకకుండా నెయ్యి దీపం వెలిగిస్తే ఆర్ధికంగా కలిసి వస్తుంది.
మరిన్ని ముఖ్య వార్తలు:
షోయబ్ అక్తర్ కూతుర్ని చూశారా? అచ్చం హీరోయిన్ లా ఉందిగా !
ఉపాసన బిడ్డ కోసం ఊయల సిద్దం.. ఎవరు తయారు చేశారో తెలుసా ?
చాణక్య నీతి: ఈ 8 మందికి ఇతరుల బాధ ఎప్పటికీ అర్ధం కాదు!