Home » భార్య‌భ‌ర్త‌ల సంసారం సాఫీగా సాగాలంటే ఈ 8 త‌ప్పులు అస్స‌లు చేయ‌కూడ‌ద‌ట‌..? 5వది ముఖ్య‌మైన‌ది..?

భార్య‌భ‌ర్త‌ల సంసారం సాఫీగా సాగాలంటే ఈ 8 త‌ప్పులు అస్స‌లు చేయ‌కూడ‌ద‌ట‌..? 5వది ముఖ్య‌మైన‌ది..?

by AJAY
Ad

భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వ‌లు ఉన్నాయంటే ఆ కాపురం ఎక్కువ కాలం నిల‌బ‌డ‌దు. త‌రచూ గొడ‌వలు జ‌రుగుతూ ఉంటే ఏదో ఒక‌రోజు ఇద్ద‌రూ విడిపోయే రోజు కూడా వ‌స్తుంది. అయితే భార్యభ‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వ‌లు రాకుండా ఉండాలంటే కొన్ని త‌ప్పులు చేయ‌కూడ‌ద‌ని మాన‌సిక నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం….భార్యా భ‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వ‌లు రాకుండా ఉండాలంటే గతంలో ఎవ‌రినైనా ప్రేమించినా లేదంటే సంబంధం పెట్టుకున్నా ఆ విష‌యాల‌ను జీవిత భాగ‌స్వామి వ‌ద్ద తీసుకురాకూడ‌ద‌ట‌.

Advertisement

అంతే కాకుండా ఇద్ద‌రూ ఒక‌రిని ఇబ్బంది పెట్టేలా మ‌రొక‌రు మాట్లాడ‌కూడ‌ద‌ట‌. ఒక‌సారి అలా చేస్తే మ‌రోసారి అలా చేయ‌కూడ‌ద‌ట‌. భార్య కానీ భ‌ర్త కానీ త‌మ జీవితభాగ‌స్వామికి స్వేచ్ఛ లేకుండా చేయ‌కూడ‌ద‌ట‌. భార్య‌కు భ‌ర్త‌పై భర్త‌కు భార్య పై ముందుగా న‌మ్మ‌కం ఉండాలట‌. న‌మ్మ‌కం లేక‌పోతే కాపురాలు నిల‌బ‌డ‌వు కాబ‌ట్టి ఎలాంటి త‌ప్పు లేకుండా వారిని అనుమానించ‌కూడ‌ద‌ట‌.

Advertisement

భార్య భ‌ర్త‌లు మంచి స్నేహితులుగా ఉండాల‌ట‌. అలా ఉండ‌టం వ‌ల్ల ప‌ర్స‌న‌ల్ విష‌యాల‌ను సైతం పంచుకుంటారట‌. ప్ర‌తిఒక్క‌రూ ఎవ‌రికి వారే ప్రత్యేక‌మైన గుణాల‌ను అలవాట్ల‌ను క‌లిగి ఉంటారు. కాబ‌ట్టి ఇత‌రులతో మీ జీవిత భాగ‌స్వామిని అస్ప‌లు పోల్చ‌కూడ‌దు.

భార్య కానీ భ‌ర్త కానీ ఒక‌రిపై మ‌రొక‌రు కోపాన్ని చూపించ‌కూడ‌ద‌ట‌. అలా కోపాన్ని ప్ర‌ద‌ర్శించ‌డం వ‌ల్ల గొడ‌వ‌లు జ‌రిగే అవ‌కాశం ఉంద‌ట‌. భార్య కానీ భర్త కానీ ఒక‌రినొకరు దూశించుకోకూడ‌ద‌ట‌. అంతే కాకుండా జీవిత భాగ‌స్వామి బంధువులను స్నేహితుల‌ను కూడా దూషించ‌కూడ‌ద‌ట‌.

Visitors Are Also Reading